పవన్ ఫాన్స్ కు శ్రీరెడ్డి వార్నింగ్?

Thursday, April 19th, 2018, 07:59:05 PM IST


ఇటీవల కాస్టింగ్ కౌచ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. శ్రీరెడ్డి వాదనను తప్పుపడుతుంటే, మరికొందరు మద్దతు పలుకుతున్నారు. అయితే ఈ విషయమై మొన్న ఆమె జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను అసభ్య పదజాలంతో దూషించడం టాలీవుడ్ తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర కలకం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాను వర్మ సలహా ప్రకారమే అలా తిట్టానని, పవన్ కు ఆయన తల్లికి బహిరంగా క్షమాపణలు చెబుతున్నానని శ్రీరెడ్డి ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వ్యవహారానికి మొత్తం కారణం తానే అని చెప్పిన వర్మ కూడా పవన్ కు ఆయన అభిమానులకు సారీ చెప్పాడు. అయినప్పటికీ శ్రీరెడ్డిపై కోపంతో ఉన్న పవన్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారు.

సోషల్ మీడియాలో శ్రీరెడ్డిని విపరీతంగా దూషిస్తూ, కించపరుస్తూ, బెదిరిస్తూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. నటుడు శివబాలాజీతో పాటు మరికొంతమంది పవన్ అభిమానులు శ్రీరెడ్డికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా నిన్న రాత్రి ఓ చానెల్ స్టూడియోకు వచ్చి వెళుతోన్న శ్రీరెడ్డిని పవన్ ఫ్యాన్స్ చేజ్ చేయడం, పోలీసులు సాయంతో ఆమె ఇల్లు చేరుకోవడం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో పవన్ అభిమానులను ఉద్దేశించి శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టింది. తన ఫేస్ బుక్ పేజీ పోలీసుల నిఘాలో ఉందని, తాను పవన్ కు సారీ చెప్పానని, నిజానికి వర్మ ప్రోగ్బలంతో అలా అనాల్సి వచ్చిందని చెప్పినా కూడా ఆయన ఫ్యాన్స్ ట్రోలింగ్ ఆగడం లేదని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. తన పేజీ పోలీసుల నిఘాలో ఉండటంతో ట్రోలింగ్ చేసేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించింది.

పవన్ అభిమానుల ట్రోలింగ్ ను అందరికీ చూపించాలని మేం భావిస్తున్నాం. అలానే జాతీయ మానవహక్కుల కమిషన్ మద్దతు మాకుంది. జాతీయ, అంతర్జాతీయ మీడియా కూడా ఈ అంశాన్ని గమనిస్తోంది అని శ్రీరెడ్డి పేర్కొంది. మరోవైపు కొందరు పెద్దలు తెలివైన గేమ్స్ ఆడుతూ, అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆమె అంటోంది. తాను చేసిన పనికి క్షమాపణ చెప్పినప్పటికీ పవన్ ఫాన్స్ ఈ విధంగా తనను టార్గెట్ చేయడం సరికాదని ఆమె వాపోతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఈ ఉదంతానికి అసలు కారకుడు అయినా వర్మను వదిలిపెట్టేది లేదని, ఆయన పవన్ కు బహిరంగంగా, రాతపూర్వక క్షమాపణ చెప్పాల్సిందే అని కామెంట్ లు పెడుతున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments