తెలుగుదేశం, వైకాపా పార్టీలకు పుట్టగత్తులు ఉండవ్

Monday, September 10th, 2018, 02:37:17 PM IST

ఈ రోజు జరుగుతున్న పెట్రోలు మరియు డీజెలు ధరలు తగ్గించాలని భారత దేశం అంతటా చేస్తున్న అని పార్టీలు బంద్ ప్రకటన నిమిత్తం రాష్ట్రం అంతటా బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. ఈ బంద్ లో భాగం గా అనంతపురం లో జరుగుతున్న బంద్ లో సిపిఐ నేతలు తెలుగుదేశం మరియు వైకాపా పార్టీల మీద కొన్ని ఆసక్తికరమైన విమర్శలు చేశారు. అవి ఒకింత ఆసక్తిగాను ఒకింత ఆలోచింపదగినవి గాను ఉన్నాయి.

ప్రపంచం అంతటా పెట్రోలు ధరలు తక్కువ ఉన్నాసరే భారతదేశం లో మాత్రం ఎక్కువ ఉండటం అన్యాయం అని క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నా సరే ఇక్కడ అధికంగా ఉండటం ఎంత వరకు న్యాయం అని బంద్ లో పాల్గొన్న సిపిఐ నేతలు అంటున్నారు. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రములో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక వైపు బంద్ కి మద్దతుగా ఉన్నాను అంటూ, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నాం అంటూ, ఈ రోజు బంద్ కి పాల్పడుతున్న నేతలను అందరిని కారాగారం లో వెయ్యడానికి రాత్రి నుంచే పోలీసులను మోహరించారని ఇది ఎంత వరకు న్యాయం అని మీరు ఇంకా వారితోనే కలిసి ఉన్నారు అన్నట్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా రాష్ట్రం లో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎందుకని ఈ బంద్ కి మద్దతు ఇవ్వలేదు అని కేంద్రప్రభుత్వానికి భయపడుతన్నారా అన్నట్టు తెలివిగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు కాస్త ఆలోచింపదగినవి గానే ఉన్నాయి..

  •  
  •  
  •  
  •  

Comments