పవన్ చేసిన ఆ విమర్శలు బాలయ్య పైనేనా?

Thursday, July 26th, 2018, 03:50:08 AM IST


కొన్ని కొన్ని సార్లు ఎటువంటి వ్యక్తులైనా సరే సందర్భాన్ని అనుసరించి, ఆ సందర్భాన్ని, పరిస్థితిని యెరిగి మాట్లాడవలసి ఉంటుంది. అయితే అటువంటి సమయంలో కొందరు జాగ్రత్తగా తెలివిగా వ్యవహరిస్తే, మరికొందరు మాత్రం వున్నవిషయాన్ని ముక్కుసూటిగా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వెల్లడించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇందులో రెండవ కోవకు చెందిన వ్యక్తిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ఇక పార్టీలోకి కొత్తగా చేరుతున్నవారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన పోరాట యాత్ర సాగుతోంది. ఇక ప్రస్తుతం అయన యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతోంది.

రెండురోజుల క్రితం తన కాలు బెణకడంతో ప్రస్తుతం భీమవరంలో రెస్ట్ తీసుకుంటున్న ఆయన వద్దకు వచ్చిన కొందరు అభిమానులతో పవన్ కాసేపు ముచ్చటించారు. స్థానిక పోలీసులు తమని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, లేనిపోని కేసులు తమపై బనాయించి, పార్టీ తరపున పాల్గొనే కార్యక్రమాల్లో కూడా పాల్గొననివ్వకుండా చేస్తున్నారని, అంతేకాక తమ బైక్ లకు వున్న సైలెన్సర్ ను తీసివేసి శబ్దం చేయకుండా బండి నడపాలంటూ హెచ్చరిస్తున్నారని తమ ఆవేదనను చెప్పుకున్నారు. అయితే వారి మాటలు విన్న పవన్ మాట్లాడుతూ, నిజాలను నిగ్గుతేల్చి అడుగుతున్న మాపై, మా జనసైనికులపై ఈ విధంగా దాడులు చేసి కేసులు పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.

అయినా బైక్ లైసెన్స్ తీసి శబ్దం చేసుకుంటూ వెళ్తే తప్పంటున్నారు సరే, మరి ఇంట్లో కాల్పులు జరిపి దర్జాగా బయట ఆనందంగా తిరుగుతున్నవారిని మాత్రం ఎందుకు పట్టించుకోరు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు గతంలో బాల కృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసుకు సంబందించినవి అని, అప్పట్లో ఆయన ఆ కేసులో ఇరుక్కుని, తరువాత బయటపడ్డ విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు టాలీవుడ్ లోను, ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెను సంచలనమే రేపుతున్నాయి…..

  •  
  •  
  •  
  •  

Comments