పవన్ యాత్రకు ఆ టీడీపీ మంత్రి హెల్ప్ చేస్తున్నారా?

Monday, May 21st, 2018, 04:24:20 PM IST


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజా పోరాట యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన తన యాత్రలో చంద్రబాబు అలానే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన యాత్ర శ్రీకాకుళంలో సాగుతున్న విషయం తెలిసిందే. గత రెండు రోజుల క్రితం ఆయన విశాఖ జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో ఆయనకు అన్నివిధాలా సహాయంగా వ్యవహరించింది సాక్ష్యాత్తు టీడీపీ మంత్రి గంట అనుచరగణం అని అంటున్నారు.

పవన్ విశాఖ వచ్చినా దగ్గరినుండి ఆయన బస, భోజన ఏర్పాట్లు, యాత్ర లో ఎక్కడెక్కడ ఆగాలి వంటి తదితరాలన్నీ ఎవరు చూసారా అని ఆరాతీస్తే వాళ్ళు మరెవరో కాదు మంత్రి గంటా అనుచరులే అని తేలిందట. నిజానికి టిడిపిలో ఎంత మంత్రి అయినప్పటికీ మొదటి నుండి మెగా ఫామిలీ కి అత్యంత సన్నిహతుడుగా గంటా పేరుని చెపుతుంటారు. ఆయన కుమారుడి సినీ రంగ ప్రవేశమపుడు జయంత్ ని దర్శకుడిగా పెట్టి సినిమా చేస్తే బాగుంటుందని చిరంజీవే సలహా ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంతే కాదు అయన ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుండి కూడా పోటీ చేసిన విషయం విదితమే. ఇక పవన్ గత ఎన్నికల్లో టీడీపీ కి మద్దతు ఇవ్వడంతో గంట ఒకింత ఆనందానికి లోనయ్యారని, కాగా ప్రస్తుతం పవన్ టిడిపి పై విమర్శలు చేస్తుంటే గంటా మౌనం వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

కొందరు టీడీపీ మంత్రులు మాకు టచ్ లోనే వున్నారని జనసేన నేతలు కూడా అక్కడక్కడా బహిరంగంగానే చెపుతున్నారు. వారిలో ముఖ్యంగా వుంది గంటానే అంటున్నారు. మరో వైపు పవన్, లోకేష్ ని విమర్శిస్తుంటే మంత్రులు మౌనం వహించడం, అంతే కాక గంటా వంటి వారు ఆయన వెనుక చేరి ఈ విధంగా సహాయ సహకారాలు అందించడం పై టీడీపీ అధిష్టానికి ఫిర్యాదులు కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయమై టీడీపీ అధిష్టానం ఏ మేరకు ప్రతిస్పందించి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి…..

  •  
  •  
  •  
  •  

Comments