బిగ్ బాస్-2 లో బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?

Sunday, July 29th, 2018, 04:36:38 PM IST

బిగ్ బాస్ మొదటి భాగం తో పోలిస్తే రెండవ భాగం మొదట్లో కొన్నాళ్లు నిరాశకు గురిచేసినా, ప్రస్తుతం కాస్త జోరు అందుకుని ముందుకు సాగుతోంది. ముఖ్యంగా రెండు మూడు వరాల నుండి వస్తున్న గెస్ట్ ల వల్ల రేటింగ్స్ కూడా బాగా ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ షో లో ఇప్పటికేవరకు ఎలిమినేట్ అయిన వారిని మళ్ళి ఆన్ లైన్ వోటింగ్ ద్వారా తిరిగి హౌస్ లోకి పంపే అవకాశం ప్రేక్షకులకు కల్పించారు హోస్ట్ నాని. గతంలో ఎలిమినేట్ కాబడిన ఇదివరకటి కంటెస్టెంట్ ల విషయమై సంబంధించి సమాచారం ముందే లీక్ అవడంతో బిగ్ బాస్ టీమ్, ఇకపై కొంత జాగ్రత్త వహించారట. అయితే ఈ విషయమై ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా, ప్రస్తుతం కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి.

విజయవాడకు చెందిన నూతన్ నాయుడు, మరియు యాంకర్ శ్యామల తిరిగి హౌస్లో జాయిన్ అయ్యారని, అయితే వీరిద్దరి జాయినింగ్ కూడా మాములుగా జరగలేదట, అటు నూతన్ కు ఇటు శ్యామలకు ఇద్దరకు ఓట్లు అనూహ్యంగా దాదాపుగా సమానంగా వచ్చాయని సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ వుండదనే విషయం తెలిసిందే కనుక, వాళ్లిద్దరూ తిరిగి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో మళ్ళి షో మరింత రసవత్తరంగా సాగబోతున్నట్లు తెలుస్తోంది. కాగా బిగ్ బాస్ హౌస్ లోకి మల్లి పునః ప్రవేశించ బోతున్న నటులు ఎవరు అని బిగ్బాస్ ప్రకటించడం కూడా ఈ వార్తలకు కొంత ఆద్యం పోస్తోందని తెలుస్తోంది. కాగా ఇక్కడ చిన్న లాజిక్ ఉందని, బిగ్ బాస్ పలికిన మాటలను బట్టి కంటెస్టెంట్ అని పలకకుండా కంటెస్టెంట్స్ అని అయన పలకడం ద్వారా వారిద్దరూ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఇచ్చిన సూచనగా నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే చూడాలి మరి ఈ వార్త ఎంతవరకు నిజమో అనేది…

  •  
  •  
  •  
  •  

Comments