బిగ్ బాస్-2 కి ముహూర్తం కుదిరింది… మరి అందులో కంటెస్టెంట్లు వీళ్లేనా ?

Wednesday, May 30th, 2018, 12:16:21 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి బుల్లి తెరపై వ్యాఖ్యాతగా వ్యవహరించిన షో బిగ్ బాస్. స్టార్ మా ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారమైన ఈ షో అప్పట్లో మంచి పేరు, రేటింగ్స్ సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే మొదటి భాగం మొత్తం 70 రోజులపాటు సాగింది. చివరకు ఫైనల్ లో నటుడు శివ బాలాజీ విజేతగా నిలిచాడు. ఇక అప్పటినుండి సీజన్-2 పై వీక్షకులకు మరింత ఆసక్తి పెరిగింది. అయితే అనూహ్యంగా ఆ షో కు నాచురల్ స్టార్ నానిని హోస్ట్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ షో తాలూకు వీడియో టీజర్ కొద్దిరోజుల క్రితంనుండి స్టార్ మా ఛానెల్స్ లో ప్రసారమవుతోంది. ఇక ఎట్టకేలకు నేడు అందరి ఎదురుచూపులు తెరదించుతూ ఆ ఛానల్ షో ని జూన్ 10 నుండి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9గంటలకు, అలానే సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30నిముషాలకు ప్రసారం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అందులో షో మొత్తం 100 రోజుల పాటు సాగుతుందని, అంతే కాదు కంటెస్టెంట్ లు ఈ సారి ఏకంగా 16 మంది అని తీసుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

ఇంతవరకు బాగానే వున్నా, అసలు అందులో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరా అని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కాగా కొద్దిసేపటినుండి సోషల్ మీడియాలో టాలీవుడ్, అలానే బుల్లితెరకు సంబందించిన ఒక 16 మంది పేర్లు వీరే బిగ్ బాస్-2 కంటెస్టెంట్ లు వీరే అంటూ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ హల్ చల్ సృస్తిస్తున్న వారెవరంటే, హీరోయిన్ ఛార్మి, యాంకర్ శ్యామల, సింగర్ గీత మాధురి, యాంకర్ లాస్య, హీరోయిన్ రాశి, హీరో తరుణ్, ఆర్టిస్ట్ ధన్య బాలక్రిష్ణ, జూనియర్ శ్రీదేవి, హీరోయిన్ గజాలా, చాందినీ చౌదరి, హీరోయిన్ శ్రీరెడ్డి, హీరో వరుణ్ సందేశ్, హీరో తనీష్, వైవా హర్ష, కమెడియన్ వేణు, హీరో ఆర్యన్ రాజేష్ అంటూ వీరిపేర్లు తెగ వినిపిస్తున్నాయి. అయితే ఈ వీరిలో ఎంతమంది నిజంగా ఆ షో లో వున్నారో, ఈ వార్త అసలు ఎంతవరకు నిజమో తెలియాలంటే జూన్ 10 వరకు వేచి ఉండాల్సిందే మరి…..

  •  
  •  
  •  
  •  

Comments