మళ్ళీ కొత్త 1000 రూపాయల నోట్లు వస్తున్నాయా…?

Saturday, December 31st, 2016, 06:10:53 PM IST

new-1000-notes
పాత 1000, 500 నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం వాటి స్థానంలో కొత్తగా 2000 రూపాయల నోటును మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా 1000 రూపాయల నోటును తీసుకొస్తున్నారని ఆన్ లైన్ లో చిత్రాలు చక్కెర్లు కొడుతున్నాయి. పెద్దనోట్ల రద్దుకు ముందు 2000 రూపాయల నోటు ఇదేనంటూ కొన్ని చిత్రాలు ఆన్ లైన్ లో హల్ చల్ చేశాయి. ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తరువాత ఆన్ లైన్ లో కనిపించిన నోట్లనే ఆర్బీఐ కూడా విడుదల చేసింది. ఇప్పుడు ఈ 1000 రూపాయల నోటును కూడా కొత్త సంవత్సర కానుకగా తీసుకు రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త నోట్లు బూడిద, ఆకుపచ్చ రంగుల్లో ఉన్నాయంటూ ఈ చిత్రాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

నోట్ల రద్దు నిర్ణయంపై ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఒక సందర్భంలో మాట్లాడుతూ… కొత్త 1000 రూపాయల నోటు తీసుకురానున్నామని, విభిన్న రంగు, కొత్త డిజైన్ తో దీనిని తయారు చేస్తామని, దీనికి కొంచెం సమయం పడుతుందని అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఆయన వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. ఈ వార్తలు ఎంతవరకూ నిజమో కొంతకాలం వేచి చూస్తే తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  

Comments