జగన్ లాంగ్ జంప్ చేసారంట..ఇది కూడా వార్తేనా..?

Tuesday, October 9th, 2018, 12:12:13 PM IST

వైసీపీ పార్టీ వ్యవస్థాపకులు వై ఎస్ జగన్ ఇప్పుడు విజయనగరంలో ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసినదే.అందులో భాగంగానే నిన్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో తాను నడుస్తున్న రోడ్డుపై ఒక దగ్గర కొద్దిగా నీరు ప్రవహిస్తుంది. దీనితో జగన్ తన బూట్లు తడిచిపోతాయేమో అని ఒక రెండు అడుగులు వెనక్కి వేసి ఆ ప్రవాహాన్ని దాటేసారు.

ఇప్పుడు ఇందులో ఏం పెద్ద వింత కనిపించిందో మరి మన మీడియా చానళ్ళు జగన్ లాంగ్ జంప్ అంటూ ప్రచారం చేసేస్తున్నారు.ఈ చోద్యాన్ని చూస్తున్న సాధారణ జనం మాత్రం ఇదొక వార్తా..?అన్నట్టు అభిప్రాయపడుతున్నారు.ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసినపుడు చూపిన పర్వాలేదు కానీ మరీ ఇలాంటి వాటికి కూడా అంత పెద్ద ప్రచార సంస్థలు కూడా ఎదో పెద్ద వింత జరిగినట్టు ప్రచారం చెయ్యడం ఏమిటని జనం నవ్వుకుంటున్నారు.