హుదూద్ తరహాలో భీభత్సం సృష్టిస్తున్న “తిత్లీ” తుఫాన్.!

Thursday, October 11th, 2018, 10:30:16 AM IST

2014 వ సంవత్సరం ఇదే అక్టోబరు నెలలో ఉత్తరాంధ్ర వాసులకు అది ఒక పీడ కల.అది మాత్రం ఇప్పటికి వారు మర్చిపోలేరు.హుదూద్ తుఫాన్ అప్పుడు సృష్టించిన భీబత్సం అంతా ఇంతా కాదు ఎన్నో వందల కోట్లు నష్టం.ఇప్పుడు మళ్ళీ అంతే తరహాలో ఉత్తరాంధ్రను మరో భారీ తుఫాను కుదిపేసింది.అదే “తిత్లీ” తుఫాను.హుదూద్ మొత్తం విశాఖ నుంచి ఒరిస్సా వరకు తన ప్రభావాన్ని చూపగా ఈ తుఫాను మాత్రం శ్రీకాకుళం మీదగా దాటి ఇప్పుడు ఒడిశా మీదగా తన ప్రభావాన్ని చూపుతుంది.

శ్రీకాకుళం జిల్లాలోని, భారీ ఎత్తున దాదాపు యాభై కిలోమీటర్ల మేర భారీ వర్షాలు,వందల కిలోమీటర్ల వేగంతో శ్రీకాకుళం జిల్లాని కుదిపేశాయి.ఇప్పటికే అక్కడ దాదాపు 15 సెంటీమీటర్ల నీటి మట్టం లోతు వర్షపాతం నమోదు అయ్యినట్టు తెలుస్తుంది.అంతే కాకుండా బలంగా వీచినటువంటి ఈదురు గాలులకు చాలా చోట్ల పెద్ద పెద్ద వృక్షాలే నేల కూలాయని తెలుస్తుంది దీనితో శ్రీకాకుళంలో చాలా ఎక్కువ స్థాయిలోనే నష్టం వాటిల్లుతుందని తెలుస్తుంది.ఈ తుఫాన్ ప్రభావం వల్ల వజ్రపుకొత్తూరు,ఇచ్చాపురం,సోంపేట,పలాస గ్రామాలపై తీవ్రప్రభావం చూపడం వల్ల ఎక్కువ స్థాయిలో నష్టం వాటిల్లుతుందని,తెలుస్తుంది.