ఇషాంత్ శర్మ బుగ్గపై ముద్దు!

Sunday, May 13th, 2018, 01:10:18 AM IST

ఒకప్పుడు టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇషాంత్ శర్మ ఆ తరువాత కొన్నాళ్లకే ఫామ్ లో లేక జట్టు నుంచి అవుట్ అయ్యాడు. ఐపీఎల్ లో కూడా అతన్ని ఎవరు తీసుకోలేదు. దీంతో ఇషాంత్ ఇంగ్లండ్‌లో కౌంటీల్లో పాల్గొంటున్నాడు. రీసెంట్ గా తన భార్యతో కలిసి ఇంగ్లాండ్ వెళ్లాడు. అయితే అక్కడ లంబు బుజం గాయం కారణంగా ఓ మ్యాచ్ కు దూరమయ్యాడు. ససెక్స్‌ టీమ్ లో ఉన్న ఈ ఆటగాడు అక్కడ ఎంతో కొంత తన ఫామ్ ని పెంచుకోవాలని చూస్తున్నాడు. ఇక గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం తన భార్య ప్రతిమతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అక్కడ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు వెళ్లి హ్యాపీగా గడుపుతున్నాడు, ఇక తన భార్య ఇషాంత్ పై ఉన్న ప్రేమను ఒక ,ముద్దు పెట్టి ఫోటో ద్వారా రిలీజ్ చేసింది. అతని బుగ్గపై ముద్దు పెట్టిన ఫొటోను సోషల్ మీడియాలో నిజంగానే వైరల్ అయ్యేలా చేసింది.ఇక ఫొటోపై ప్రస్తుతం ఇషాన్ ఫాలోవర్స్ చాలా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Comments