‘పీకే’ సినిమాకు ఐఎస్ఐ పెట్టుబడులు?

Monday, December 29th, 2014, 06:46:42 PM IST

pk
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం రోజుకో వివాదంలో చిక్కుకుంటోంది. కాగా తాజాగా ఈ చిత్రంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి కొత్త ఆరోపణలకు తెర లేపారు. ఈ నేపధ్యంగా సుబ్రమణ్య స్వామి మాట్లాడుతూ పీకే సినిమా తీయడానికి డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. అలాగే ఆ సినిమాకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పెట్టుబడులు పెట్టిందంటూ సుబ్రమణ్య స్వామి తీవ్రంగా ఆరోపించారు.

ఇక పీకే సినిమాపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు. కాగా పీకే సినిమాపై ఇప్పటికే పలు హిందూ సంస్థలు పిర్యాదులు చెయ్యగా, ముస్లిం లాబోర్డు సభ్యుడు కూడా ఇందుకు మద్దతు తెలపడం విశేషం.