అమ్మాయిలకు రామ్ బంపర్ ఆఫర్..!

Tuesday, February 12th, 2019, 04:22:14 PM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమాకు ఛార్మి పూరీ జగన్నాథ్ లు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు, వాలెంటైన్స్ డే సందర్బంగా సినిమా యూనిట్ ఒక ఆసక్తికరమైన కాంటెస్ట్ తో ముందుకొచ్చింది. ఈ కాంటెస్ట్ తాలూకు వివరాలు ఛార్మి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది, ఆ వివరాల్లోకి వెళితే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆ కాంటెస్ట్ పెట్టారు.

ఈ కాంటెస్ట్ కోసం అమ్మాయిలు చేయాల్సిందల్లా తెలంగాణ యాసలో రామ్ కు ప్రపోజ్ చేస్తూ ట్విట్టర్ లో రామ్ ను ట్యాగ్ చేసి కామెంట్ చేయటమే. అమ్మాయిలు ఎవరైతే బాగా ప్రపోజ్ చేస్తారో వారికి ఇస్మార్ట్ శంకర్ సినిమా సెట్స్ లో రామ్ ను కలిసే అవకాశం, లభిస్తుంది, ఈ కాంటెస్ట్ గురించి ఛార్మి చేసిన పోస్ట్ కింద అబ్బాయిలు తమకు కూడా సినిమా హీరోయిన్ నాభా నటేష్ కు ప్రపోజ్ చేసే ఛాన్స్ కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు.