టీడీపీ నేత‌ల పై ఐటీ దాడులు.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి సంచ‌ల‌నం..!

Friday, October 12th, 2018, 05:01:33 PM IST

ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ నేత‌ల పై జ‌రుగుతున్న ఐటీ దాడులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. మొన్న బీద మ‌స్తాన్, నిన్ని సుజ‌నా చౌ ద‌రి, నేడు సీయ ర‌మేష్ ఇలా వ‌రుస‌గా టీడీపీ నేత‌ల పై ఐటీ పంచా విసురుతోంది. దీంతో టీడీపీలో క‌ల‌క‌లం రేప‌డంతో పాటు నెక్ట్స్ టార్గెట్ ఏవ‌రంటూ ఒక‌రి ముఖాలు మ‌రొక‌రు చూసుకుంటున్నారు. ఇక టీడీపీ నేత‌లు పైకి మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ.. కేంద్ర‌స‌ర్కార్ రాజ‌కీయ క‌క్ష్య‌లో భాగంగానే త‌మ పై కుట్ర‌లు చేస్తుంద‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే టీడీపీ నేత‌ల పై జ‌రుగుతున్న ఐటీ దాడుల పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. సీయం ర‌మేష్ పై ఐటీ దాడులు జ‌రుగుతుంటే, నారా లోకేష్‌కి త‌డిసిపోతుంద‌ని.. ఆయ‌నెందుకు ఉలిక్కిప‌డుతున్నారో చాల‌మందికి తెలుస‌ని, 2014లో అధికారంలోకి వ‌చ్చాక తండ్రీ కొడుకులు ఇద్ద‌రూ క‌లిపి ప్రాజెక్టుల పేరుతో కొన్ని ల‌క్ష‌ల కోట్లు దేశం దాటించారని.. అవ‌న్నీ బ‌య‌ట ప‌డుతాయ‌ని మంత్రి లోకేష్‌కి బెంగ ప‌ట్టుకుంద‌ని విజ‌య సాయి రెడ్డి అన్నారు. ఊహించ‌ని విధంగా ఒక్క‌సారిగా ఐటీ అధికారులు వ‌రుస‌గా టీడీపీ నేత‌ల పై దాడులు చేస్తుంటే.. తండ్రీ కొడుకుల‌కు నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని విజ‌య సాయి అన్నారు. మ‌ర విజ‌య సాయి రెడ్డి వ్యాఖ్య‌ల పై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.