టార్గెట్ ఎక్స్ : టీడీపీ మంత్రుల‌పై ఐటీ క‌న్ను?

Thursday, October 4th, 2018, 01:33:19 PM IST

త‌మ‌కు ప్ర‌తికూలంగా మారి, భాజపా నుంచి తెగ‌తెంపులు చేసుకున్న చంద్ర‌బాబు & కోపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఐటీ దాడులు చేయించ‌నున్నారా? అంటే అవున‌నే తాజాగా స‌మాచారం అందుతోంది. ఏపీలో తేదేపా నాయ‌కుల అవినీతిపై ప‌క్కాగా స‌మాచారం తెప్పించుకున్న మోదీ అందుకు ప్లాన్ రెడీ చేశార‌ని చెప్పుకుంటున్నారు. ప్ర‌స్తుతానికి టార్గ‌ట్ -ఎక్స్ గా నామ‌క‌ర‌ణం చేసిన ఈ దాడికి సంబంధించి ఇంకా గుట్టు చ‌ప్పుడు కాకుండానే ఉంద‌ని ఏపీ పొలిటిక‌ల్ కారిడార్‌లో ముచ్చ‌ట సాగుతోంది.

ఎనీ టైమ్‌.. ఈ ఎటాక్స్‌కి ఆస్కారం ఉంది. అందుకు పకడ్బందీ వ్యూహాన్ని ఆదాయ‌ప‌న్ను శాఖ‌-ఈడీ శాఖ‌లు సిద్ధం చేశాయ‌ని చెబుతున్నారు. అవినీతిని అంత‌మొందిస్తాన‌ని, అది ఎక్క‌డ ఉన్నా, సొంత పార్టీలో అయినా త‌ప్ప‌ద‌ని ప్ర‌క‌టించిన దేశ ప్ర‌ధాని మోదీ అన్న ంత ప‌నీ చేస్తున్నారు. ముఖ్య ంగా ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని త‌మ ప్ర‌త్య‌ర్థుల్ని ముప్పు తిప్ప‌లు పెట్టేందుకు ఈ దాడులు త‌ప్ప‌వ‌న్న స‌మాచారం అందింది. అయితే ఈ విష‌యాన్ని ముందే ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు నాయుడు త‌న క్యాబినెట్ స‌మావేశం లో సీరియ‌స్‌గానే హెచ్చ‌రించార‌ట‌. అన్ని జాగ్ర‌త్త‌ల‌తో సిద్ధంగా ఉండండి. ఏ క్ష‌ణాన అయినా ఎటాక్స్ ఉండొచ్చ‌ని బాబు హెచ్చ‌రించార‌ట‌. అవినీతిలో దొరికితే పార్టీ ప్ర‌తిష్ట‌కు భంగం క‌ల‌గ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించార‌ట‌. ఈ హెచ్చ‌రిక‌ల‌తో తెలుగు త‌మ్ముళ్ల గుండెల్లో ఒణుకు మొద‌లైంద‌ని చెబుతున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కాంట్రాక్టుల్లో బోలెడ‌న్ని మోసాలకు పాల్ప‌డిన త‌మ్ముళ్ల‌కు ఇక కౌంట్ డౌన్ మొద‌లైన‌ట్టేన‌ని తెలుస్తోంది. అంతేకాదు తేదేపా- భాజ‌పా మైత్రీ బంధంలోనూ ప‌లుమార్లు చంద్ర‌బాబును మోదీ అవినీతి విష‌య‌మై హెచ్చ‌రించార‌న్న స‌మాచారం ఉంది. త‌మ్ముళ్లే త‌ప్పు చేసినా వ‌దిలిపెట్ట‌న‌ని ఆయ‌న హెచ్చరించార‌ట‌. అందుకే బాబు & కోలో ఈ భ‌యం అని తెలుస్తోంది.