ఐటి ఉద్యోగులకు హైదరాబాద్ ఒక వరం!

Friday, May 4th, 2018, 11:04:19 AM IST

ప్రస్తుత రోజుల్లో దేశంలో అందరి చూపు హైదరాబాద్ వైపే చూస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఈ నగరంలో ఐటి సంస్థలకు అనుకూలంగా మారుతున్నాయి. టాలెంట్ ఉంటే యువతకు మంచి జీవితం ఇక్కడే లభిస్తోంది. అందుకే వివిధ నగరాల నుంచి కంపెనీలు గాని ఉద్యోగులు గాని మన నగరంలో ఉద్యోగం కావాలని వస్తున్నారు. ఐబీఎం, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, వెల్స్‌ ఫార్గో, ఇన్ఫోసిస్‌, అమేజాన్‌, మైక్రోసాఫ్ట్‌ లాంటి ఐటి కంపెనీలు ఇక్కడి ఉద్యుగులతోనే ఎక్కువగా సంతృప్తి చెందుతోంది.

ఎందుకంటే డేటా సైంటిస్ట్‌లు, యూఐ/యూఎక్స్‌ డిజైనర్ల కొరత చాలా ఎక్కువైంది. బేసిక్స్ తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తూ ట్రైనింగ్ ఇచ్చి మరి వాడుకుంటున్న కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉద్యోగులు ఇతర నాగరాలతో పోలిస్తే తక్కువ వేతనాలతో సరిపెట్టుకుంటున్నారు. బెంగుళూర్ వంటి నగరాలతో పోలిస్తే 10-20 శాతం వేతనాలకు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అంటే 10 ఏళ్ల అనుభవం ఉన్న డేటా సైంటిస్ట్‌లకు బెంగళూరులో 20 లక్షల వరకు వేతనాలు ఇస్తున్న కంపెనీలు ఇక్కడ మాత్రం 10 నుంచి 15 లక్షల వరకు ఇస్తున్నాయి. పైగా ఉద్యోగులకు ఇక్కడ దిన ఖర్చులు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువే.

జీవన విధానంలో జీతానికి సరిపడ జీవితాన్ని గడపవచ్చని సర్వేల ద్వారా వెల్లడైంది. అలాగే అందుబాటులో ఉండే అమెజాన్ – ఉబెర్ వంటి సేవలు. మెట్రో నగరాలతో పోలిస్తే ట్రాఫిక్ తక్కువగా ఉండడం. పలు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ఉండడం ఐటి ఉద్యోగులకు వరంలా మారుతోంది. అందుకే కంపెనీలు ఎక్కువగా హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంటున్నాయి. ఉద్యోగులు కూడా ఇక్కడే ఉద్యోగం చేసుకోవడం బెటర్ అని డిసైడ్ అవుతున్నారు. ఇక ఐటి మంత్రి కేటీఆర్ కూడా కంపెనీల కోసం అనుకూల వాతావరణం ఏర్పాటు చేయడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments