మరో ప్రముఖ టీడీపీ నేత బంధువులపై ఐటీ దాడులు !

Thursday, October 25th, 2018, 12:46:54 PM IST

ఎటు చూసినా రయ్ రయ్ మంటూ దూసుకెళుతున్న ఐటీ అధికారుల వాహనాలు వాటి వెనకే పోలీసు జీపులు.. అంతా హైటెంక్షన్. ఇది ప్రెజెంట్ విశాఖలో పరిస్థితి. ఎవరి నోట విన్నా ఐటీ శాఖ దాడుల మాటే. నిన్ననే ఖచ్చితమైన ఆధారాలతో నగరంలోకి గుట్టు చప్పుడు కాకుండా వివిధ రాష్ట్రాల నుండి సుమారు 100 మంది ఐటీ అధికారులు దిగారట. పక్కా ప్లాన్ ప్రకారం అధికారులు బృందాలుగా విడిపోయి ఎంవీపీ కాలనీ నుండి బయలుదేరి పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు.

నిన్నే ఈ విషయం తెలుసుకున్న పన్ను ఎగవేస్తున్న బడా పారిశ్రామికవేత్తలు, అవినీతికి పాల్పడ్డ రాజకీయనాయకులు ఎవరికి వారే తమపై దాడులు జరగవచ్చనే భయంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారట. ప్రస్తుతం అధికారులు సోదా చేస్తున్న భారీ లాజిస్టిక్ కంపెనీ టీజీఐ కూడ ఉంది. ఇది తెలంగాణ టీడీపీ నేత దేవేందర్ గౌడ్ బంధువులదని తెలుస్తోంది. ఎగుమతులకు సంబంధించిన ఆదాయ వివరాల్లో ఈ కంపెనీ అవకతవకలకు పాల్పడిందనే అనుమానాలు రావడంతో ఈ దాడులు జరుగుతున్నాయట.

ఇప్పటికే ఇరు రాష్ట్రాలో రేవంత్ రెడ్డి, సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి ప్రముఖుల పై సోదాలు జరగి ఉండటం, ఇప్పుడు మరొక ముఖ్య నేత బంధువుల కంపెనీల్లో రైడ్స్ జరుగుతుండటంతో కంగారు మొదలై తప్పు చేసిన పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు ఆధారాల్ని, అక్రమ ఆస్తుల వివరాల్ని, ఆధారాలు లేని నగదును దొడ్డిదారిన తరలించే పనిలో ఉన్నారట. మొత్తానికి ఈరోజు సాయంత్రం నాటికి దాడులు సోదాల్లో ఎవరి బండారం బయటపడిందనే వివరాలు తెలియనున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments