భారతదేశం అంతటిని కాషాయమయం చేయడానికే ఈ ఐటీ దాడులా.?

Saturday, October 6th, 2018, 09:33:07 AM IST

ప్రస్తుతం దక్షిణ భారతదేశం అంతటిని కాషాయమయం చెయ్యడానికి కేంద్రం కంకణం కట్టుకుందా అన్నటుండి ఇప్పుడు పరిస్థితి.ఎందుకంటే సరిగ్గా ఇంకా ఎన్నికలకు అటు రాష్ట్రంలోనూ మరియు కేంద్రంలోను సమయం తక్కువ ఉండడంతో,ఇప్పుడు ఎలాగో కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే కాబట్టి ఉత్తరాదిన ఎలాగో మంచి పట్టు ఉంది కానీ దక్షిణ భారతదేశం విషయానికి వస్తే మాత్రం అసలు వారిని పట్టించుకునే వారు కూడా లేరు దీనితో కావాలనే ఇక్కడ నరేంద్ర మోడీ ఐటీ దాడులు చేయిస్తున్నారని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ దాడులను మనం గమనించినట్లయితే అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోనూ ఎవరైతే బీజేపీకి బలంగా వ్యతిరేకతను కనబరుస్తున్నారో వారి మీదనే దాడులు జరుపుతున్నట్టు తేట తెల్లం అవుతుంది.తెలంగాణలోని కాంగ్రెస్ నాయకుల మీద ఆంధ్ర లోని తెలుగుదేశం నాయకుల మీద అకస్మాత్తుగా ఐటీ దాడులు జరిపారు,ఈ పరిస్థితులను పరిశీలిస్తే బయటకి మోడీ ప్రమేయం లేదంటూనే వారికి వ్యతిరేకంగా ఉన్న వారి మీద దాడులను నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంలో టీడీపీ నేతలు కేవలం మమ్మల్ని మాత్రమే టార్గెట్ చెయ్యడం ఏమిటని,వేల కోట్లు అవినీతి చేసినటువంటి వైసీపీ పార్టీ మీద ఎందుకు దాడి చేయట్లేదని విమర్శిస్తున్నారు.

ఈ దాడుల యొక్క ప్రధాన సారాంశం ఏమిటి అంటే అధికార పార్టీల అందులోను ఇక్కడి ప్రాంతీయ పార్టీలు వారు చేస్తున్న అవినీతిని బయట పెట్టి ప్రజల్లో వ్యతిరేకతను తీస్కోచి,ఒక వేళ బీజేపీ గెలవకపోయినా వారి అడుగు జాడల్లో నడిచేటువంటి నాయకులను వారు అధికారంలోకి తెచ్చుకొని మెల్లగా దక్షిణ భారతదేశం అంతటా తమ కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తున్నారా? అన్నట్టు సందేహం అయితే వస్తుంది.