మోదుగుల పై ఐటి అధికారుల మోత..!

Wednesday, September 28th, 2016, 10:00:58 AM IST

venugopal-reddy
తెలుగుదేశం పార్టీ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి ఆస్తులపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన నివాసం, ఆఫీస్ లలో ఐటి అధికారులు ఒకేసారి సోదాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన బెంగుళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్స్ లో అవకతవకలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

వాటికి సంబందించిన కీలక పత్రాలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.వీటన్నింటిని నిశితంగా పరిశీలించిన తరువాత మోదుగులకు ఐటి అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మోదుగుల ఐటి దాడులు నిర్వహించే సమయం లో ఆయన అందుబాటులో లేరు. దీనితో అంతటా చర్చినీయాంశంగా మారింది.ఎవరైనా ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయా లేక ఇందులో రాజకీయ కోణం ఉందా అనే చర్చ జరుగుతోంది.అధికారపార్టీ ఎమ్మెల్యే పై ఈ దాడులు జరగండం ఒకింత ఆశ్చర్యమే.

Comments