అది మహానాడు కాదు, మాయనాడు : వైసిపి నేతలు

Sunday, May 27th, 2018, 11:30:46 PM IST


టీడీపీ ప్రభుత్వం ప్రస్తుతం విజయవాడలో ఏర్పాటు చేసినది మహానాడు కాదని, మాయనడని వైసిపి నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, తమ్మినేని సీతారాం అన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టుపెట్టిన బాబు, మహానాడు పేరుతో ప్రజల్లో సానుభూతిని కూడగట్టాలని చూస్తున్నారని, ఆ నేతలు చెపుతున్నట్లు మహానాడు సభలో ప్రజలు లేక పూర్తిగా ప్లాప్ అయిందని, అక్కడికి కనీసం పదివేల మందికూడా వెళ్లడం లేదని అన్నారు. అయినా ప్రజలు మాటలు చెపితే రారని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి అనేది చేతల్లో చేసి చూపించాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక, మట్టి దోచుకుతింటున్న చంద్రబాబు ఆయన అనుచరగణం ఆఖరికి దేవుడి నగలు కూడా వదలడం లేదని ఎద్దేవా చేసారు. చంద్రబాబుకు కేంద్రం అన్నా, కేంద్రప్రభుత్వ నేతలన్నా భయం పట్టుకుందని, త్వరలో అన్ని నిజాలు బయటపడి ఆయన జైలుకు వెళ్లి చిప్పకూడు తినడం ఖాయమన్నారు.

ఓవైపు కర్ణాటకలో బీజేపీ నేతలు ఎమ్యెల్యేలను కొంటున్నారు అని మాట్లాడిన ఆయన వైసిపి ఎమ్యెల్యేలను ఎలా కొన్నారో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్టీఆర్ ను వంచించి టీడీపీ అధినేతగా ఎదిగారని, ఇప్పటికే ఆయన చేతిలో టీడీపీ పూర్తిగా భూస్థాపితం అయ్యే స్థాయికి వచ్చిందని అన్నారు. చంద్రబాబు, అయన పార్టీ నేతలు చేస్తున్న ఆకృత్యాలు, అక్రమాలు ఇప్పుడిప్పుడే ప్రజలు పూర్తిగా తెలుసుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి చాలాచోట్ల డిపాజిట్లు కూడా రావని అన్నారు. అంతేకాక అయన కుమారుడు లోకేష్ చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై ఇతర పార్టీలనేతలు నిలదీస్తుంటే వారిపై లేనిపోని నిందలేసి కేసు లు పెట్టిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు……

  •  
  •  
  •  
  •  

Comments