కేసీఆర్ రైతులకు అండగా నిలబడటం చాలా గొప్ప విషయం: దేవె గౌడ

Saturday, April 14th, 2018, 03:45:28 AM IST

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలబడటం సంతోషకరమని జనతాదళ్(సెక్యులర్) అధినేత దేవెగౌడ అన్నారు. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో పరిష్కారం కానీ సమస్యలు ఎన్నో ఉన్నయి. సీఎం కేసీఆర్‌తో దేశ రాజకీయాలపై చర్చించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో రైతులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నరు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగినయి. రైతుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నయన్నారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో జనరంజక పాలన కొనసాగుతుందన్నారు. గ్రామీణాభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుబడుతున్నదని కొనియాడారు. గర్భిణీల కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి తెలంగాణ మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు.