కెసిఆర్ కు ఛాలెంజ్ విసురుతున్న కాంగ్రెస్ నేత జానా రెడ్డి..!

Saturday, September 8th, 2018, 03:00:02 PM IST

నిన్న తెలంగాణా హుస్నాబాద్ లో జరిగిన “ప్రజా ఆశీర్వాద సభ” లో కెసిఆర్ మాటలకు సమాధానం ఇస్తూ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కాంగ్రెస్ నేత జానా రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మీద నిప్పులు చెరిగారు. తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణా రాష్ట్రం లో ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేసినట్టు ఐతే నేను గులాబీ జెండా కప్పుకుంటానని అసెంబ్లీలో నేను అనలేని మాటలు వారు అన్నట్టుగా అసత్య ప్రచారం చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ లో ఒకవేళ నేను అలా అన్న మాటల రికార్డులు ఉన్నట్లతే ఆ టేపులు తీసుకువచ్చి ప్రజల ముందు పెట్టాలి అని నేను అలా అన్నట్టు నిరూపిస్తే అస్త్ర సన్యాసం చేస్తాను అని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ ఆలా నిరూపించని పక్షం లో 24 గంట్లలోపు తనకి కెసిఆర్ క్షమాపణ చెప్పాలి అని మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments