అదరగొట్టిన జడేజా.. ముందుగానే తీసుకోవాల్సింది!

Monday, September 10th, 2018, 10:39:36 AM IST

ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ కోల్పోయి సిరీస్ లో మిగిలిన చివరిటెస్టునైనా దక్కించుకోవాలని భారత ప్రయత్నం చేస్తోంది. స్వదేశీ పిచ్ లపై బాగా అలవాటుపడిన బ్రిటిష్ బ్యాట్స్ మెన్ లను అవుట్ చేయడం భారత్ వశమవుతున్నా బౌలర్లను మాత్రం మన బ్యాట్స్ మెన్లు ఆదుకోలేకపోతున్నారు. పిచ్ పై సమయాన్ని బట్టి ప్రణాళికలతో బంతులు విసరడం ఇంగ్లీష్ బౌలర్లకు ముందు నుంచి అలవాటే. ఇకపోతే చాలా రోజుల తరువాత టెస్టుల్లో అడుగుపెట్టిన రవీంద్ర జడేజా ప్రత్యర్థి బౌలర్లను గట్టిగానే దుర్కొన్నాడు.

5వ టెస్టులో ఎవరు ఊహించని విధంగా జడేజా ఆడాడు. మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్ లో కూడా రాణించాడు. 156 బంతుల్లో 86; 11 ఫోర్లు, 1 సిక్స్‌, నాటౌట్‌ గా నిలిచి ఇంగ్లాండ్ ఉత్సాహానికి బ్రేకులు వేశాడు. మొదటి ఇన్నింగ్స్ లో 332 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. ఇక భారత్ బ్యాట్స్ మెన్ లు ఎప్పటిలానే వరుసగా పెవిలియన్ బాట పడుతుండగా ఆల్ రౌండర్ జడేజా హనుమ విహరితో కలిసి 77 పరుగుల కీలక బాగా స్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే జడేజాను ముందుగానే తీసుకొని ఉంటే బావుండేదని పలువురు సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇన్నింగ్స్ చివరివరకు నిలిచి జడేజా జట్టు స్కోరును 292 పరుగులకు చేర్చాడు. అనంతరం మూడవరోజే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు 114 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కూక్(49), రూట్(29) క్రీజ్ లో ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments