జడేజాకు పోయించాడుగా దోనీ..!

Monday, May 14th, 2018, 11:56:32 AM IST

సాదారణంగా ఏ క్రికెటర్ అయినా మ్యాచ్ అనగానే కోసమేరుపంతైనా భయంలో ఉంటాడు. ఇంకొందరికైతే ఫీల్డ్ లోకి దిగగానే చమటలు పడతాయి.కానీ ఐపీఎల్ పదకొండో సీజన్‌ను ధోనీ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏకదా భయపడకుండా తానూ ఉత్సాహవంతాగా ఆడుతూ ఇటు తన టీంతో కూడా ఆదరగోట్టేల తన ప్రదర్శన చూపిస్తున్నాడు. రెండేళ్ల తర్వాత మరోసారి తనకెంతో ఇష్టమైన ఎల్లో జెర్సీలోకి వచ్చేసిన మహి.. బ్యాట్‌తోనూ బరిలో దిగిన్ గుర్రంలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. నిలకడగా ఆడుతూ.. టీమ్‌కు విజయాలు సాధించిపెడుతున్నాడు. మామూలుగానే ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోనీ.. ఈసారి గ్రౌండ్‌లో తన హాస్యపు చేష్టలతో అభిమానులకు, ఇతి ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తున్నాడు. అలాంటిదే ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ జరిగింది. చెన్నై ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజాను సరదాగా భయపెట్టి కామాతలు పట్టించాడు ధోనీ. ధావన్ మిడ్‌వికెట్ దిశగా కొట్టిన బాల్‌ను పరుగెత్తుకుంటూ వెళ్లి ఆపిన ధోనీ.. డీప్ మిడ్‌వికెట్ నుంచి జడేజా పరుగెత్తుకు రావడాన్ని గమనించాడు. బాల్‌ను అతని వైపు విసిరి కొడుతున్నట్లు ధోనీ నటించాడు. అది చూసి కామెంటేటర్లతోపాటు ప్రేక్షకులంతా నవ్వుల్లో మునిగిపోయారు. కానీ నిజంగా ఆ క్షణం జడేజాకి ఉన్నట్టుండి చెప్పలేనంత భయం పుట్టుకోచ్చిందట. అలాంటివి ఎన్ని చేసినా అవన్నీ ఫ్రెండ్లీగానే అని, ఆటను మరింత రసవత్తంగా చేయడానికి అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుంటానని దోనీ అన్నాడు.