కాపు రిజర్వేషన్ పై నేను అలా అనలేదు: జగన్

Wednesday, August 1st, 2018, 01:22:40 AM IST

కొన్ని రోజుల కిందట సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ కాపుల రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. తాను చేయగలిగే వాటి గురించే చెబుతానని కాపు రిజర్వేషన్ అనేది రాష్ట్ర పరిధిలోకి రాని అంశం అని కాకపోతే కాపులకు నిరంతరం వైఎస్సార్ అండగా ఉంటుందని జగన్ ఇటీవల వివరణ ఇచ్చినట్లు పలు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు జగన్ తాను ఆ విధంగా అనలేదని చంద్రబాబు అండతో ఎల్లో మీడియా ఈ విధంగా ప్రచారాలు చేస్తోందని అన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం బహిరంగ నేడు జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ..
కాపులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని సిఎం చంద్రబాబు మోసగాడా? లేక కాపులకు మద్దతుగా నిలబడ్డ జగన్ మోసగాడా? అంటూ ప్రశ్నించిన జగన్ యూ టర్న్ తీసుకునే అలవాటు తమకు లేదని కాపు రిజర్వేషన్ కు తమ పార్టీ మద్దతు ఉంటుందని వివరణ ఇచ్చారు. ఇక ఎల్లో మీడియా తన మాటలను వక్రీకరించి ప్రచారాలను నిర్వహిస్తోందని బిసిలకు అన్యాయం చేయకుండా జరిగేలా కాపు రిజర్వేషన్ ఉండాలనే ఆలోచన తమదని తెలిపారు. చంద్రబాబు ప్రతి కులాన్ని మోసం చేశారని చెప్పిన జగన్ అబద్దాలు చెప్పే అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments