72 గంటల్లో ఏది కావాలన్నా ఇస్తాం.. జగన్ హామీలు!

Wednesday, November 15th, 2017, 09:07:41 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉంది. ప్రతి పక్ష పార్టీ పాదయాత్రతో బిజీగా ఉంటె అధికార పార్టీ తన పని తాను చేసుకుకుంటూ పోతోంది. జగన్ వైఎస్సార్ పార్టీని అధికారం లోకి తేవాలని ప్రజలకు పదే పదే గుర్తు చేస్తున్నారు. అంతే కాకుండా ఎప్పటిలానే చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేస్తున్నారు. ఊహించని విధంగా సరికొత్త హామీలను ఇస్తున్నారు. జనాలు ఎంత వరకు నమ్ముతున్నారో గాని జగన్ మాత్రం హామీలను ఇవ్వడంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

ప్రతి గ్రామంలో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడు. ప్రజా సంకల్పం పాదయాత్ర నిన్న ఉదయం వైఎస్సార్‌ జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు సాగింది. అయితే చాగలమర్రిలోని ముత్యాలపాడు బస్టాండ్‌ వద్ద బహిరంగ సభ ఏర్పాటైంది. జగన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అబివృద్దిలో ఏ మాత్రం ముందుకు వెళ్లలేదు. అంతే కాకుండా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని చంద్రబాబు పై వికమర్షలు చేశారు. ఇక వైఎస్సార్ పార్టీని తప్పకుండా అధికారం లోకి తీసుకురావాలని చెబుతూ.. పెన్షన్, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అలాగే ఇల్లు.. ఇలా ఏది కావాలన్నా 72 గంటల్లోనే పరిష్కారమయ్యేలా చేస్తామని అందుకు ప్రతి గ్రామంలో సచివాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. లంచాలు అస్సలు ఉండవని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments