దేవుడ‌! జ‌గ‌న్ అమ‌రావ‌తి వ‌స్తే భూధ‌ర‌లు ఢాం అంటున్నాయ్‌!

Thursday, January 19th, 2017, 08:33:25 AM IST

jagan1
ప్ర‌స్తుతం అమ‌రావతి ప‌రిస‌రాల్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్‌పై ప్ర‌జ‌లు విస్త్ర‌తంగా చ‌ర్చించుకుంటున్నారు. రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనూ ఈ విష‌యం వేడి పుట్టిస్తోంది. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు నానా తంటాలు ప‌డుతూ రైతుల నుంచి 30 వేల ఎక‌రాల్ని సేక‌రించి రాజ‌ధాని నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంటే.. బాబు ప్ర‌య‌త్నానికి వ్య‌తిరేకంగా జ‌గ‌న్ ఉద్య‌మాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. రైతుల త‌ర‌పున పోరాడుతున్నా అన్న క‌ల‌రింగుతో జ‌గ‌న్ ప్ర‌తిసారీ ఏదో ఒక‌టి చేసేందుకు అమ‌రావ‌తి వ‌స్తున్నారు.

అయితే ఇలా జ‌గ‌న్ అమ‌రావ‌తి ప‌ర్య‌టించిన ప్ర‌తిసారీ అక్క‌డ రియ‌ల్ ఢ‌మాల్ మంటోంది. భూముల ధ‌ర‌లు దారుణంగా ప‌డిపోతున్నాయని రియ‌ల్ ఎస్టేట్ వాళ్లు, భూములు అమ్ముకోవాల‌నుకుంటున్న ప్ర‌జ‌లు చెప్పుకుంటున్నారు. ఈ విష‌యంపై టీవీ చానెళ్ల లైవ్‌ల‌లో ఇంట్రెస్టింగ్ డిష్క‌స‌న్ సాగుతోంది.