చాపకింద నీరులా పవన్.. తడిసిపోయెది జగన్ కేనా..?

Wednesday, November 30th, 2016, 09:20:27 PM IST

jagan-pawan
దేశంలో ఉన్న ప్రతిపక్షలన్నింటికీ ఇప్పుడు ఒకటే పని.. పెద్ద నోట్ల రద్దుపై మోడీ కేంద్రం గా విమర్శలు గుప్పించడడం.దేశంలో ఉన్న సామాన్య ప్రజలు కరెన్సీ కొరత తో ఇబ్బందులు పడడానికి మోడీ పిచ్చి తుగ్లక్ వలే తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయమే అని విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశంలోని బిజెపి యోతర పార్టీలన్నీ మోడీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి.మోడీ తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అన్న విషయం పక్కన పెడితే.. దానివలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన నిలబడడం సరైందే. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి వేరుగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పెద్ద నోట్ల రద్దు అంశం సరిగా అమలు పరచడం లేదని విమర్శించారు. కానీ ప్రతిపక్ష పార్టీ వైసిపి మాత్రం ఈ విషయంలో కూడా చంద్రబాబునే దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తోంది.

ఒక ప్రతిపక్ష నేతగా జగన్ మొదట ప్రజల సమస్యలపై స్పందించాలి. పెద్ద నోట్ల రద్దు వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎత్తి చూపాలి. పెద్ద నోట్ల రద్దు చంద్రబాబుకు ముందే తెలుసు అని ఆయన తన నల్ల ధనాన్ని ముందే మార్చేసుకున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో జగన్ తీరు విమర్శలపాలు అవుతోంది. ప్రతిపక్ష నేత గా జగన్ చేస్తున్న విమర్శలు సందర్భానుసారంగా లేవనే విమర్శ ఉంది. పెద్ద నోట్లరద్దు అనేది పూర్తిగా మోడీ తో ముడిపడిన అంశం. ఈ విషయంలో విమర్శలు చేయాల్సివస్తే మోడీ పైనే చేయాలి. కానీ ఈ అంశాలలోకి కూడా బాబుని లాగి లబ్ది పొందాలనుకుంటే జగన్ మరో తప్పు చేస్తున్నట్లే అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన జనసేన అధినేత సూటిగా సుత్తి లేకుండా పెద్ద నోట్ల రద్దు పై స్పందించాడు. పెద్ద నోట్ల రద్దు వలన ప్రజలు పడుతున్న ఇబ్బదులను తెలియజేయడానికి ప్రయత్నించాడు. దీనికి భాద్యులైన మోడీకి మాత్రమే తగిలేలా విమర్శలు సంధించాడు.పెద్దనోట్ల రద్దు నిర్ణయం కసరత్తు లేకుండా తీసుకున్నారని అందువలనే ప్రజలు ఇబందులు పడుతున్నారని విమర్శించారు. వీలైనంత వరకు సామాన్యుల ఇబ్బందులను తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ కేంద్రానికి సూచించాడు. కానీ జగన్ ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోలేదని విశ్లేషకులు అంటుంన్నారు. మోడీ ని విమర్శించడానికి జగన్ భయపడుతున్నాడంటూ టిడిపి విమర్శిస్తోంది. ప్రతిపక్ష నేతగా జగన్ తన బాధ్యతని గుర్తించకపోతే ఆ ప్లేస్ ని పవన్ కొట్టేయడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.