ఆర్కే బీచ్ లో ‘స్పెషల్’ అట్రాక్షన్ ఎవరో..?

Tuesday, January 24th, 2017, 03:45:31 AM IST

pawan-rk-beach-jagan
జల్లికట్టు ఉద్యమాన్ని తమిళులు ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ దాని పుణ్యమా అని ఆంద్రప్రదేశ్ లో మరో మారు ప్రత్యేక హోదా ఉద్యమం మొదలు కాబోతోంది.ఏపీ యువత ఆద్వర్యంలో ఏపీ ప్రత్యేక హోదా కోసం శాంతి యుత పోరాటాన్నివైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత వై ఎస్ జగన్ లు ఇప్పటికే మద్దత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఏపీలో ప్రత్యేక హోదా డిమాండు ఉన్నా ఉద్యమం మాత్రం హోదాని సాధించే రీతిలో ఇప్పటి వరకు జరగలేదన్నది వాస్తవం.దీనితో పవన్, జగన్ లాంటి వారు ఇప్పటికే మద్దత్తు ప్రకటించడంతో జనవరి 26 ఆర్కే బీచ్ లో జరగబోయో ప్రత్యేక హోదా ఉద్యమం పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.ఉత్తరాది నాయకుల మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధించాలని యువతకు పవన్ పిలుపునిచ్చారు. అలాగే వైసిపి అధినేత జగన్ కూడా దీనిపై స్పదించారు. ప్రత్యేకహోదా సాధనకోసం జరిగే ఏ కార్యక్రమానికైనా తమ మద్దత్తు ఉంటుందని జగన్ ప్రకటించారు.

కాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజ్ ని కూడా ప్రకటించింది.కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్ పై అప్పట్లో జగన్, పవన్ కళ్యాణ్ లు విముఖత వ్యక్తం చేశారు.కానీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మాత్రం నడిపించలేకపోయారు. ఆంధ్ర యువత తాజాగా ఆర్కే బీచ్ లో జనవరి 26 న శాంతి యుత పోరాటానికి సిద్ధమవుతుండడంతో వారికీ మద్దత్తు తెలపాలని జగన్, పవన్ లు డిసైడ్ అయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం దీనిపై స్పందించారు. జల్లికట్టు కు ప్రత్యేక హోదా కి పోలికేంటని చంద్రబాబు ప్రశ్నించారు. కొందరు చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా ? అభివృద్ధి జరుగుతుందా ? అని బాబు ప్రశ్నించారు. ఈ నేపథ్యం లో చంద్రబాబు హోదా ఉద్యమం పై ఎలాంటి వైఖరి అనుసరిస్తారో అనే అంశం ఆసక్తిగా మారింది.టిడిపి , బీజీపీ లు ఖచ్చితంగా ఈ ఉద్యమానికి మద్దత్తు తెలపవు. కాగా చద్రబాబు ఈ ఉద్యమాన్ని జరగనిస్తారా లేక పోలీస్ లతో అణచివేసే ప్రయత్నం చేస్తారా అనే చర్చ జరుగుతోంది.

హోదా ఉద్యమానికి పవన్, జగన్ లు మద్దత్తు తెలపడంతో ఈ ఉద్యమం వారికి రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉంటుందనే చర్చ జరుగుతోంది. వైసిపి ఎలాగైనా 2019 లో అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల నాటికి పార్టీ బలోపేతమే లక్ష్యం గా అడుగులు వేస్తున్నారు. టిడిపి, బిజెపి లు హోదా ఉద్యమం లో పాల్గొనావు కాబట్టి ఇక మిగిలింది వైసిపి, జనసేన పార్టీలే. జన సేన పార్టీ ఉద్యమంలో పాల్గొంటుందన్న సంకేతాలు ఇప్పటికే అందుతున్నాయి. ఇక వైసిపి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటుందా లేక బయటి నుంచి మద్దత్తు ఇస్తుందా అనే అంశం తేలాల్సి ఉంది. ఆర్కే బీచ్ లో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచే నాయకుడు ఎవరు ?.. జగనా ?పవనా ? అనే చర్చ జోరుగా సాగుతోంది.