చంద్ర‌బాబుకు బిగ్‌షాక్ : జ‌గ‌న్‌తో చేతులు క‌ల‌ప‌నున్న‌.. మ‌రో ఇద్ద‌రు కీల‌క నేత‌లు..?

Friday, March 15th, 2019, 11:54:27 AM IST

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతుంది. ఒక‌వైపు వైసీపీ అధినేత జ‌గన్ మోహ‌న్ రెడ్డి అభ్య‌ర్ధ‌లు జాబితాను ఫైన‌లైజ్ చేసేప‌నిలో ఉంటే.. మ‌రోవైపు పార్టీలో వ‌ల‌స‌లు మాత్రం ఆగ‌డం లేదు.

ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో ఇద్ద‌రు మంత్రులు జ‌గ‌న్‌తో చేతులు క‌లప‌నున్నార‌నే వార్త‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. వారిలో ఒక‌రు విశాఖ‌ప‌ట్నం సీనియ‌ర్ నేత‌ కొణ‌తాల రామ‌కృష్ణ, మ‌రొక‌రు క‌ర్నూలు సీనియ‌ర్ నేత‌ డీఎల్ ర‌వీంద్ర‌. కొద్ది రోజులుగా కొణ‌తాల రామ‌కృష్ణ టీడీపీలో చేరుతున్నార‌ని, అన‌కాప‌ల్లి ఎంపీగా పోటీ చేయ‌నున్నార‌ని వార్త‌లు జోరుగా వినిపించాయి.

అయితే తాజా ట్విస్ట్ ఏంటంటే.. కొణ‌తాల రామ‌కృష్ణ వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. తాజాగా అన‌కాప‌ల్లిలో త‌న అనుచ‌రుల‌తో సమావేశం అయిన కొణ‌తాల వైసీపీలో చేరాల‌ని అనూహ్య‌నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న త్వ‌ర‌లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ కానున్నార‌ని తెలుస్తోంది.

ఇక మ‌రోవైపు డీఎల్ ర‌వీంద్ర‌రెడ్డి కూడా టీడీపీలో చేరాల‌ను కున్నారు. మైదుకూరు నుండి పోటీ చేయాల‌ని భావించిన డీఎల్‌కు హ్యాండ్ ఇచ్చారు చంద్ర‌బాబు. ఈ క్ర‌మంలో మైదుకూరు టిక్కెట్‌ను పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు ఖ‌రారు చేశారు చంద్ర‌బాబు. దీంతో తాజాగా జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు డీఎల్ ర‌వీంద్రా రెడ్డి. అయితే జ‌గ‌న్ నుండి డీఎల్‌కు ఎలాంటి హామీ ల‌భించిందో తెలియ‌దు కానీ, ఆయ‌న టీడీపీని భూస్థాపితం చేస్తాన‌ని శ‌ప‌థం చేశారు. ఈ క్ర‌మంలో ఈ ఇద్ద‌రు మాజీ మంత్రులు క‌రెక్ట్‌గా ఎన్నిక‌ల టైమ్‌లో జ‌గ‌న్‌తో చేతులు క‌లిపితే చంద్ర‌బాబుకు ఊహించ‌ని దెబ్బే అని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.