మీరు సెక్యూరిటీ కల్పిస్తే పాదయాత్ర చేసుకుంటా..!!

Thursday, November 2nd, 2017, 06:42:53 PM IST

ప్రతిపక్ష నేత జగన్ నవంబర్ 6 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. దాదాపు ఆరు నెలల పాటు జగన్ పాదయాత్ర జరగనుంది. పాదయాత్ర సమయంలో తనకు తగిన భద్రత కల్పించాలని జగన్ ఏపీ డిజిపికి నేడు లేఖ రాశారు. ఈ మేరకు డిజిపి జగన్ లేఖని అందుకున్నారు. తాను చేపట్టబోతున్న 3 వేల కిమీ పాదయాత్రకు తగిన భద్రత కల్పించాలని జగన్ లేఖలో కోరారు.

కాగా జగన్ పాదయాత్ర చేపడితే సమస్యలు తలెత్తుతాయని డిజిపి ఇప్పటికే ప్రకటించారు. దీనితో జగన్ లేఖకు డిజిపి ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ అందరిలో నెలకొనివుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో మాట్లాడుతూ జగన్ పాదయాత్రతో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రతిపక్ష నేత రిక్వస్ట్ మరో వైపు పాదయాత్రపై చంద్రబాబు అసంతృప్తి.. ఇన్ని రాజకీయ ఒత్తిళ్ల మధ్య డిజిపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments