జగన్ నడవడంలో బిజీగా ఉంటే నేనేం చెప్తాను..పవన్ ఫన్నీ కామెంట్.!

Tuesday, October 23rd, 2018, 02:00:11 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బలమైన అధికార పక్షం ఉన్నపుడు దానికి ధీటుగా ఉండేటువంటి ప్రతిపక్షం కూడా ఉందని మొదట్లో అనుకునేవారు.కానీ అలా కొన్ని నెలల వ్యవధిలోనే జగన్ తన పార్టీ శ్రేణులతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చెయ్యడం,ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పాదయాత్రలు చేసుకుంటున్నాడు అని అధికార పార్టీ వారు విమర్శలు చేశారు.అంతే కాకుండా ప్రజా సమస్యల పట్ల మాట్లాడ్డంలో జగన్ విఫలం అయ్యాడని రాజాకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు.అయితే గత కొద్ది రోజులు నుంచి జగన్ మరియు పవన్ ల మీద కొన్ని విమర్శలు వచ్చాయి.టిట్లి తుఫాన్ వల్ల అంత నష్టం జరిగితే వీరు ఇరువురు కనీసం పట్టించుకోవట్లేదని టీడీపీ నేతలు మండిపడ్డారు.

ఇందుకు గాను పవన్ తాను ఆదిలోనే అక్కడికి ఎందుకు వెళ్ళలేదో అన్నదాని మీద కూడా వివరణ ఇచ్చి తన కవాతు అనంతరం పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా శ్రీకాకుళం ప్రాంతంలోని టిట్లి తుఫాను బాధితులను పరామర్శిస్తున్న సంగతి తెలిసినదే.అక్కడికి వెళ్లి పవన్ కొన్ని ప్రభుత్వ సహకారాలు సరిగ్గా అందనటువంటి గ్రామాలను కూడా వెలుగులోకి తీసుకువచ్చారు.ఇదంతా బాగానే ఉండగా జగన్ మాత్రం తన పాదయాత్రతోనే బిజీగా ఉన్నారు.ఈ విషయం పైనే ఈ రోజు విశాఖపట్నం లోని నిర్వహించినటువంటి ఒక సభలో పవన్ ను ఒక వ్యక్తి రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి వైసీపీ అధినేత జగన్ ఇంకా టిట్లి బాధితులను ఇంకా పరామర్శించకపోవడాన్ని మీరు ఎలా తీసుకుంటారు అని అడగగా జగన్ అండ్ కో నడవడంలో బిజీ గా ఉంటే వారి కోసం నేనేం చెప్తాను అని నవ్వుతూ సమాధానమిచ్చి సభను ముగించేశారు.

  •  
  •  
  •  
  •  

Comments