జగన్ గెలిస్తే ఆ ముగ్గురిలో ఆర్థిక మంత్రి ఎవరన్నది తేలిపోయిందిగా..!

Wednesday, May 22nd, 2019, 09:51:53 AM IST

ఏపీలో గత నెలలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. అయితే గతంలో కన్నా ఈ సారి ఎన్నికలు పోటా పోటీగా సాగాయి. ప్రధానంగా మూడు పార్టీలు బలంగా ఉన్నా గెలుపు మాత్రం వైసీపీ, టీడేఎపీల మధ్యనే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే వెలువడిన సర్వే ఫలితాలు వైసీపీదే విజయమని చెప్పగా, మొన్న విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వైసీపీకే పట్టం కట్టాయి. అయితే వీటన్నిటి ఆధారంగా వైసీపీ అధికారంలోకి రాబోతుందని, జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని వైసీపీ పార్టీ నేతలు గట్టి ధీమాతో ఉన్నారు.

అయితే అన్ని సర్వేలు చెబుతున్నట్టుగానే రేపు వెలువడే ఫలితాలలో వైసీపీ విజయం సాధిస్తే జగన్ క్యాబినెట్‌లో మంత్రి పదవులు ఎవరికి ఇస్తారో అని పార్టీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ మంత్రి పదవి చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నా వైసీపీ అధిష్టానం నుంచి మాత్రం ఖచ్చితమైన సమాధానం లేదు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన క్యాబినెట్లో కీలకమైన ఆర్థిక మంత్రి పదవి కోసం వైసీపీ నేతలు బాగానే పోటీ పడుతున్నారట. అయితే ఇప్పటికే సొషల్ మీడియాలో ఒకరిద్దరి పేర్లు కూడా గట్టిగానే ప్రచారం అవుతున్నాయి.

వైఎస్ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ కేబినెట్‌లో ఆర్థికమంత్రి బాధ్యతలను అప్పచెబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు డోన్ ఎమ్మెల్యే బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి పేరు కూడా జగన్ లిస్టులో ఉందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. అయితే వీరిద్దరే కాకుండా మరో రెండు పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఢిల్లీలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇస్తారని ఒక వేళ మంత్రి పదవి ఇస్తే మాత్రం ఆర్థిక మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. అయితే ఆనం రామనారాయణ రెడ్డితో పాటు విజయ్ సాయి రెడ్డి ఇద్దరు కూడా ఆర్థికరంగంలో నిష్ణాతులు కావడం వలన జగన్ వీరిద్దరిలో ఎవరో ఒకరికి అర్థిక శాఖను కట్టబెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఆనం మాత్రం పార్టీలుం మారుకుంటూ వైసీపీలో చేరిన విషయం తెలిసిందే అయితే విజయసాయి రెడ్ది మాత్రం ముందు నుంచి జగన్ వెంటే ఉంటూ వైసీపీలో సీనియర్ కీలక నేతగా మారాడు. అయితే ఆనం, విజయసాయి రెడ్డిల మధ్యలో జగన్ ఆర్థిక మంత్రి పదవిని ఎవరికి కట్టబెట్టబోతున్నారో అనేది మాత్రం ఫలితాల తరువాత తెలిసిపోనుంది.