జగన్ పై దాడి.. ప‌క్కా ప‌థకం ప్ర‌కామేనా.. క‌త్తి అప్పుడే కొన్నాడా..?

Monday, October 29th, 2018, 09:19:00 AM IST

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నంలో భాగంగా జ‌రిగిన దాడి ఘ‌ట‌న పై సిట్ విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. జ‌గ‌న్ పై దాడి చేసిన నిందుతుడు శ్రీనివాస‌రావు ప‌క్కా ప‌థ‌కం ప్ర‌కార‌మే దాడి చేశాడ‌ని తెలుస్తోంది. శ్రీనివాస్ ద‌గ్గ‌ర ఓ ట్యాబ్, మూడు సెల్‌ఫోన్‌ల‌ను విచార‌ణ‌లో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఈ నేప‌ధ్యంలో దాడిలో వాడిన క‌త్తి కొన్ని నెల‌ల క్రిత‌మే నిందుతుడు శ్రీనివాస్ కొనుగోలు చేశాడ‌ని స‌మాచారం.

దీంతో విచార‌ణ‌ను వేగ‌వంతం చేసిన సిట్ అధికారులు హ‌త్యాయ‌త్నానికి గ‌ల కార‌ణాలు.. ఎవ‌రు చేయించారు అనే విష‌యం పై దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా నిందితుడు శ్రీనివాస్ ప‌ని చేసిన రెస్టారెంట్ య‌జ‌మానిని, అదే రెస్టారెంట్‌లో ప‌నిచేస్తున్న వారిని విచారించాల‌ని భావిస్తున్నారు. అంతే కాకుండా నిందితుడు విజయాబ్యాంక్‌, ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎకౌంట్లు ఓపెన్ చేశాడ‌ని.. దీంతో అత‌ని బ్యాంక్ ఎకౌంట్లు ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. అంతే కాకుండా నిందితుడి ద‌గ్గ‌ర మూడు సెల్‌ఫోన్లు, ఒక ట్యాబ్‌ను గుర్తించారు. దీంతో అత‌ని కాల్ డేటాను కూడా చెక్ చేస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి రానున్న రోజుల్లో ఎలాంటి నిజాలు వెలుగులోకి వ‌స్తాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments