జగన్ నీ బుద్ధి మార్చుకో : మినిస్టర్ ఆదినారాయణ రెడ్డి

Friday, September 7th, 2018, 02:46:46 PM IST

జగన్ మోహన్ రెడ్డి పార్టీ సభ్యులు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు గైర్హాజరు అవుతున్నటు తెలియజేసింది నిజమే అయితే ఈ విషయం మీద తెలుగుదేశం పార్టీ మినిస్టర్ ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ జగన్ చేసే వైఖరి చిన్న పిల్లవాడిలా ఉన్నది అని, చిన్న పిల్లవాడు పాల డబ్బా కోసం ఏడ్చినట్టు ఈయన సి ఎం కుర్చీ కోసం పాకులాడుతున్నాడు అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

జగన్ తన పార్టీ నుండి ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు పై వేటు వెయ్యమని చెప్పి అసెంబ్లీకి గైర్హాజరు అవ్వడం సబబు కాదని, అలా అయితే తెలుగుదేశం పార్టీ లో కూడా ఎమ్మెల్యేలుగా నెగ్గి నీ పార్టీ లోకి చేరిన వారి కోసం ఎందుకు మాట్లాడట్లేదు అని ఎదురు ప్రశ్నలు సంధించారు. జగన్ ఎన్ని కోట్లు కాజేసాడో ఆయనకే లెక్కలేదు అని,చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ మొదలుకొని ప్రతి ఒక్క పథకాన్ని అద్భుతంగా రాణిస్తున్నారని, మీరు తీవ్రంగా మాట్లాడితే మేము తీవ్రంగా మాట్లాడగలం అని, నీ బుద్ధి, జ్ఞ్యానం మార్చుకోవాలి అని, రాజీనామాలు చేసి ఏదేదో చేస్తాం చేస్తాం అన్నారు కానీ వాళ్ళు చేసింది ఏమి లేదు అని వారి సాక్షి ఛానెల్లో 99% అన్ని అబద్దాలే చెప్తారని విరుచుకుపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments