తెలంగాణ కంటే వెయ్యి ఎక్కువగానే ఇస్తా: జగన్

Sunday, May 6th, 2018, 02:16:27 PM IST

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఎవరి స్టైల్ లో వారు ప్రజలను ఆకర్షిస్తూ వెళుతుండగా.. జగన్ తన పాదయాత్రతో ప్రతి -పల్లె ను తాకుతూ వెళుతున్నాడు. ప్రజాయాత్ర లో జగన్ కి మద్దతు బాగానే లభిస్తోంది. చంద్రబాబు పవన్ కన్నా జగన్ ఇప్పుడు ముందున్నాడనే టాక్ వస్తోంది. ఎందుకంటే జగన్ గ్రామాల్లో తన పార్టీని బలోపేతం చేస్తున్నాడు.

ముఖ్యంగా టీడీపీ పాలనలోని లోపాలను ప్రజలకు తెలియజేస్తూ తాము అధికారంలోకి వస్తే తప్పకుండా అందరికి న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు. రీసెంట్ గా అంగన్ వాడీ కార్యకర్తల జీతాల గురించి ప్రస్తావించిన జగన్ తెలంగాణలో 10,500 వేతనం ఇస్తున్నారని, అయితే ఏపీలో టీడీపీ ప్రభుత్వం కేవలం 7,000 మాత్రమే ఇస్తున్నారని అంగన్ వాడీ కార్యకర్తల నుంచి తెలుసుకున్నారు. అంతే కాకుండా మూడు నెలల జీతం రాలేదని చెప్పడంతో జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తామని చెబుతూ.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సిపి అధికారంలోకి వచ్చాక తెలంగాణాలో ఇస్తోన్న జీతాలకంటే వెయ్యి రూపాయలు ఎక్కువగానే ఇస్తామని చెప్పిన జగన్ మూడు నెలల జీతాలు ప్రభుత్వం నుంచి వచ్చేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.