టీడీపీకి డిపాజిట్లు కూడా రావు.. జగన్ ఘాటు వ్యాఖ్యలు

Thursday, June 7th, 2018, 01:23:04 AM IST


ఒక వైపు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష పార్టీకి నెక్స్ట్ ఎలక్షన్ లో ఓటమి తప్పదని అంటుంటే.. మరో వైపు జగన్ టీడీపీ కి డిపాజిట్లు కూడా రావని చెబుతుండడం హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా ఈ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఉప ఎన్నికలు వస్తే కూడా మేమె గెలుస్తాం అని ఇరు పార్టీల నాయకులు సై అంటున్నారు. రీసెంట్ గా విలేకరులతో మాట్లాడిన జగన్ రాజీనామాల గురించి వివరించారు.

ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోగలరా అని ఓ మీడియా విలేకరి అడిగినల్ ప్రశ్నకు.. జగన్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం నేతలు రాజినామ్ చేస్తే బుద్ధి ఉన్న నేతలు ఎవరైనా సరే పోటీకి నిలబడతారా? అని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎలక్షన్స్ నిర్వహిస్తే దాని అర్థమేంటి? ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తే దాన్ని పట్టించుకోకుండా ఎలక్షన్స్ గురించి ఆలోచించడం అంటే.. హోదా గురించి పట్టునుంచోవట్లేదు అని అర్థమా? ఇది కామన్సెన్స్ తో ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికే చంద్రబాబు గారు మా దగ్గర గెలిచిన నేతలను తన వైపుకు తిప్పుకున్నారు. వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల బరిలో ఎందుకు దిగడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ ఇప్పుడు ఫొటోలోకి దిగితే తెలుగు దేశం పార్టీ నాయకులకు డిపాజిట్లు కూడా రావని జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments