నమ్మినవాళ్లే జగన్ ని మోసం చేస్తున్నారా?

Tuesday, October 17th, 2017, 08:54:47 AM IST

రాజకీయాల్లో ఎత్తులు వేయడం కాదు ఎప్పుడు ఎలా వెయ్యాలో తెలిసినవారే అసలైన రాజకీయ నాయకులు అనేలా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే తెలంగాణాలో అధికారా పార్టీ చేసిన ప్రతి పనిని ప్రజలందరికి తెలిసేలా చేస్తోంది. ఇక ప్రతి పక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకు వెళుతున్నారు. ఇక ఆంద్రప్రదేశ్ లో అయితే మొన్నటి వరకు పార్టీల మధ్య పోటీని బాగానే ఉండేది కానీ ఇప్పుడు అంచనాలు తారు మారవుతున్నాయా అనే కోణంలో అందరు అనుకుంటున్నారు.

ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైనల్ గా అందరు ఊహించిందే జరుగుతోంది. ఓ వర్గం వారు అది రూమర్ అని చెప్పినా జగన్ నిర్ణయంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. గత కొన్ని రోజులుగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నా సంగతి తెలిసిందే. అయితే రేపు అందుకు పూర్తి ఏర్పాట్లు జరగనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తరపు కార్యకర్తలు కూడా టీడీపీ నేతలతో సమావేశం అయినట్లు సమాచారం. రేపు ఉదయం టీడీపీ నేత చంద్రబాబును కలిసి ఆయన సమక్షంలోనే పార్టీ లో చేరనున్నారని టాక్. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ – వైఎస్సార్ పార్టీలో అందరు ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు వైసిపిలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు మరోనేత ఆ పార్టీలోకి వెళ్లడంతో జగన్ ప్లాన్స్ కి అధికార పక్షం చెక్ పెడుతోందా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే బుట్ట రేణుకపై వేటు పడింది. వైసీపీ అధినేత జగన్ రేణుకను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే జగన్ ప్రతి ఎలక్షన్స్ లో ఓటమి చెందడం.. ఆ తర్వాత ఎవరో ఒకరు పార్టీ నుంచి అధికార పక్షంలోకి వెళ్లడం కామన్ అయిపొయింది. జగన్ ప్రతి పక్ష హోదాలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా ఫిరాయింపుల గోల ఆయనను చాలా తికమకకు గురి చేస్తోంది. ముఖ్యంగా జగన్ ఎక్కువగా నమ్మిన వారే పార్టీ నుంచి వెళ్లిపోవడం ఆయనకు అంతు చిక్కడం లేదు. అయితే మరికొంత మంది నేతలు కూడా టిడిపిలోకి జంప్ అయ్యేలా ఉన్నారు అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి జగన్ ఈ విధానంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments