పాదయాత్ర @ 1000 కిమీ..జగన్ ఎమోషనల్ ట్వీట్..!

Monday, January 29th, 2018, 09:34:01 PM IST

ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రలో మరో మైలురాయిని చేరుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ 1000 కిమీ పాదయత్రని పూర్తి చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం గ్రామంలో జగన్ 1000 కిమీ పాదయత్రని దాటారు. ఈ సందర్భంగా జగన్ గ్రామంలో పైలని ఆవిష్కరించారు. పాదయాత్ర 1000 కిమీ చేరుకున్న నేపథ్యంలో జగన్ సోషల్ మీడియాలో ప్రజలని ఉద్దేశించి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ”నా పాదయాత్రలో మీ అభిమానం, ప్రోత్సాహం అడుగడుగునా కనిపించాయి. నాన్నగారిపై మీరు చూపిన ప్రేమ, ఈ ప్రభుత్వంలో మీరు పడుతున్న కష్టాలని దగ్గర నుంచి చూశాను. మీ ఆశీర్వాదంతో మిగిలిన పాదయత్రని పూర్తి చేస్తా” అంటూ జగన్ ట్వీట్ చేశారు.

ఓ వైపు వైసిపి నేతలు జగన్ పాదయాత్ర 1000 కిమీ వేడుకలు జరుగుపుకుంటుంటే, తెలుగు దేశం పార్టీ అవాకులు చవాకులు పేలుస్తోంది. వెయ్యి కాదు లక్ష కిమీ నడిచినా జగన్ ముఖ్యమంత్రి కాలేరని మంత్రి జవహర్ అన్నారు. జగన్ పాదయాత్రలో జనం కంటే పెయిడ్ ఆర్టిస్టులే ఎక్కువగా ఉన్నారని జగహర్ ఎద్దేవా చేశారు.