బిగ్ బ్రేకింగ్ : లగడపాటి సర్వే గుట్టు రట్టు చేసిన..సినీ జగన్ అభిమాని.!

Sunday, May 19th, 2019, 10:52:41 AM IST

ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో లగడపాటి రాజగోపాల్ పేరు మారు మోగిపోతుంది.ఒకప్పుడు లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వే అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఒక బ్రాండ్ ఉండేది.కానీ గడిచిన తెలంగాణ ఎన్నికల ఫలితాల విషయంలో మాత్రం ఈ లెక్క పూర్తిగా తప్పు అయ్యేసరికి లగడపాటి రాజగోపాల్ పై తీవ్ర వ్యతిరేఖత మొదలయ్యింది.అంతే కాకుండా చాలామందికి లగడపాటి సర్వే అంటే నమ్మకం కూడా పోయింది.ఇదిలా ఉండగా నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్ లో లగడపాటి ఏ పార్టీకి సపోర్టివ్ గా మాట్లాడారో అందరికీ అర్ధం అయ్యింది.

దీనితో వైసీపీ అధినేత జగన్ అభిమాని అయినటువంటి ప్రముఖ సినీ నటుడు పృథ్వీ లగడపాటి సర్వే గుట్టు రట్టు చేసాడు.ఈ రోజు కొన్ని చోట్ల రీపోలింగ్ ఉన్నందున ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే చంద్రబాబు 120 సీట్లు గెలుస్తాడు అది ఇది అని ఓటర్లను ప్రభావితం చేసే యత్నం చేస్తున్నారని,అయినా సరే ప్రజలు ఎవరి పక్షాన నిలబడ్డారో అన్నది 23న రాబోయే ఫలితాలలో వెల్లడి అవుతుందని అప్పటి వరకు వీరిని ఓపిక పట్టాలని తెలిపారు.వీరు ఇలా వచ్చి తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా మాట్లాడినంత మాత్రాన ఏపీ ప్రజలు వారికి ఓటేయ్యారని వారు జగన్ కే ఓటేస్తారని పృథ్వీ తెలిపారు.