జగన్ కి అనారోగ్యం..పాదయాత్ర కంటిన్యూ అవుతుంది కానీ..!

Saturday, December 2nd, 2017, 03:00:17 AM IST

వైసిపి అధినేత జగన్ పాదయాత్రలో బిజీగా గడుపుతున్నారు. నడక పెరిగే కొద్దీ జగన్ శరీరంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆయన పాదాలకు బొబ్బలెక్కిన దృశ్యాల్ని ఫైర్ బ్రాండ్ రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇలాంటి గాయాలకు వెరవ కుండా పాదయాత్ర చేస్తున్న జననేతకు పాదాభివందనం అని ఆమె కామెంట్ పెట్టారు. అదే సమయంలో జగన్ ప్రతి శుక్రవారం అక్రమాస్తుల కేసు వ్యవహారంలో కోర్టుకు హాజరు కావలసి ఉంది. జగన్ క్రమం తప్పకుండా కోర్టుకు హాజరవుతున్నారు. ఇటీవల పాదయాత్ర నేపథ్యంలో తాను కోర్టుకు వ్యతిగతంగా హాజరు కాలేనని, తన లాయర్లు హాజరవుతారని జగన్ ఫిటిషన్ దాఖలు చేసుకున్నారు. జగన్ పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది.

తాజాగా మరో మారు కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయించాలని పిటిషన్ దాఖలు చేసుకున్నారు. జగన్ పాదయాత్ర కొనసాగిస్తుండడం, కాస్త అనారోగ్యానికి గురికావడంతో కోర్టుకు హాజరు కాలేనని విన్నవించుకున్నారు. జగన్ పిటిషన్ ని కోర్టు వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. కాలికి గాయాలు కావడం, అనారోగ్యానికి గురికావడంతో వైసిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఎన్ని సమస్యలు తలెత్తినా జగన్ పాదయాత్ర పూర్తి చేస్తారని వైసిపి నేతలు అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments