చంద్రబాబు పై జగన్ సంచల వ్యాఖ్యలు..!

Tuesday, September 11th, 2018, 03:54:34 AM IST


వైసీపీ అధినేత ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్ర పేరిట విశాఖ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దీనిలో భాగం గా సిరిపురం లో బ్రాహ్మణులతో ఒక ఆత్మీయ సభలా ఏర్పాటు చేశారు. ఇందులో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హామీల్లో బ్రాహ్మణులకు చేస్తాను అన్న ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని, బ్రాహ్మణులు అంటే భగవంతునికి భక్తునికి మధ్య ఒక వారధి లాంటి వారు అని అలంటి బ్రాహ్మణులు ఇప్పుడు అత్యంత దారుణ పరిస్థుల్లో ఉంటె బాబుకు కనీసం కనికరం కలగట్లేదు అని మండిపడ్డారు.

చంద్రబాబు అధికారం లోకి దేవాలయం లో పూజారులకు పదవీ విరమణ లేకుండా చేస్తాం అని మాట ఇచ్చారని కానీ వారు అధికారం లోకి వచ్చాక రమణ దీక్షితులు గారిని అన్యాయంగా వారి పదవి లోనుంచి ఎందుకు తీసేశారని చురకలంటించారు. తెలుగుదేశం నేతృత్వం దేవాలయాలకు సంబందించిన ఆస్తులను దోచుకుంటుంది అని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణులు అందరికి న్యాయం చేకూరుస్తాం అని మాట ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments