బాప్‌రే జ‌గ‌న్‌! ఛాన్స్ దొరికితే ఉతికి ఆరేస్తుండు!!

Wednesday, March 1st, 2017, 01:50:06 AM IST


ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్ కి ఛాన్స్ దొర‌కాలే కానీ ఉతికి ఆరేస్తున్నాడు. ఏపీ ప్ర‌భుత్వానికి కంటిమీద కునుకుప‌ట్ట‌కుండా చేస్తున్నాడు. ఏ చిన్న లొసుగు దొరికినా దాన్ని ప‌ట్టుకుని పిండేస్తున్నాడు. ఇటీవ‌లి కాలంలో ప్ర‌యివేటు ట్రావెల్స్ బ‌స్సుల్లో ర‌క్ష‌ణ క‌రువైంది. ఈ బ‌స్సుల‌న్నీ తేదేపాకి చెందిన కీల‌క నాయ‌కుల‌వి కావ‌డం విశేషం. అప్ప‌ట్లో కేసినేని ట్రావెల్స్‌, ఇప్పుడు దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్సులు యాక్సిడెంటుకి గురై ప్ర‌యాణీకుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడాయి. దీంతో ఇవ‌న్నీ తెలుగు దేశం పార్టీకి చెందిన బ‌స్సులు అనేక‌దా.. ఎలాంటి ద‌ర్యాప్తులు జ‌ర‌గ‌డం లేదు.. అంటూ జ‌గ‌న్ ఫైర్ అయ్యాడు. ఈరోజు దివాక‌ర్ ట్రావెల్స్ బ‌స్సు దారుణ యాక్సిడెంట్‌లో 11 మంది పైగా ప్ర‌యాణీకులు మ‌ర‌ణించారు. మిగ‌తా వారంతా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఉదంతం త‌ర్వాత ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయిన వారిని ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన జ‌గ‌న్ ర‌చ్చ ర‌చ్చ చేశాడు. యాక్సిడెంట్లో చ‌నిపోయిన డ్రైవ‌ర్‌ని అస‌లు పోస్ట్ మార్టం చేయ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మేంటి? అంటూ నిల‌దీశాడు.

ప్ర‌యివేటు ట్రావెల్స్‌లో చ‌నిపోయిన వారి కుటుంబాల్ని ఎవ‌రు ఆదుకుంటారు? ఇలా ఇంకా ఎంత‌మంది ప్రాణాలు తీస్తారు. యాజ‌మాన్యాల్ని ప్ర‌శ్నించే వ్య‌వ‌స్థ ఉందా? అడిగే నాథుడు ఉన్నాడా? అని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. అధికార పార్టీ నేత‌ల ట్రావెల్స్ అయితే శిక్ష‌లు ఉండ‌వా? అంటూ త‌న‌దైన శైలిలో త‌లంటే ప్ర‌య‌త్నం చేశాడు జ‌గ‌న్‌. ఇలా ఏ అవ‌కాశం వ‌చ్చినా జ‌గ‌న్ ఉతికి ఆరేస్తున్నాడు.