బిగ్ బ్రేకింగ్ : “వైఎస్సార్ కడప” నుంచి జగన్ ఫిక్స్ చేసిన మంత్రులు వీరేనా.?

Sunday, May 26th, 2019, 03:20:43 AM IST

వైసీపీ అధినేత ఆంధ్ర రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం కు ఇంకా కొద్ది రోజులు మిగిలి ఉండగానే జగన్ అప్పుడే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలో నిర్ణయించేసినట్టు కూడా తెలుస్తుంది.ఇప్పటికే చిత్తూరు,నెల్లూరు మరియు విశాఖపట్నం జిల్లాల నుంచి ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలో అన్నది కూడా పక్కా ప్రణాళిక వేసేసినట్టు కూడా తెలిసింది.ఇప్పుడు తాజాగా జగన్ కంచుకోట అయినటువంటి వైఎస్సార్ కడప జిల్లా నుంచి కూడా కొంత మందికి కీలక మంత్రి పదవులు ఇచ్చినట్టు రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

జగన్ కంచు కోటలో క్లీన్ స్వీప్ చేసేసారు.అలా గెలుపొందిన అభ్యర్ధుల్లో నుంచి జగన్ కొంత మందికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం.వైఎస్సార్ కడప నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అంజద్ బాషా కు ఒక మంత్రి పదవి అలాగే రైల్వే కోడూరు నుంచి కొరముట్ల శ్రీనివాసులు కు మరో మంత్రి పదవి జగన్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం జగన్ చేసే ప్రమాణ స్వీకారం కోసమే వైసీపీ శ్రేణులు అంతా తీవ్ర ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి.