జ‌గ‌న్ పై ఉన్న అనుమానాలు.. మ‌రో రెండు రోజుల్లో తొల‌గిపోతాయి..!

Monday, February 25th, 2019, 05:00:11 PM IST

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫిబ్ర‌వ‌రి 27న గుంటూరు జిల్లా తాడేప‌ల్లి గూడెంలో నిర్మించుకున్న కొత్త ఇంటిలో గృహ‌ప్ర‌వేశం చేయనున్నారు.

ఇక ఈ ఫిబ్ర‌వ‌రి 14నే జ‌గ‌న్ కొత్త ఇంటి గృహ‌ప్ర‌వేశం జ‌ర‌గాల్సి ఉండ‌గా.. షర్మిల ఆరోగ్యం బాగ‌లేక‌పోవ‌డంతో వాయిదా వేస్తున్నామని పార్టీ నేతలు ప్రకటించారు.

ప్ర‌స్తుతం లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్, బుధ‌వారం గృహ ప్ర‌వేశం త‌ర్వాత తాడేప‌ల్లి గూడెం నుండే వైసీపీ కార్య‌క్ర‌మాల‌ను జ‌గ‌న్ నిర్వ‌హించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే జ‌గ‌న్‌కి ఏపీలో ఉండ‌డం ఇష్టంలేద‌ని, అందుకే హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్ నుండి కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు మ‌రో రెండు రోజుల్లో జ‌గ‌న్ పూర్తి స్థాయిలో ఏపీ కేంద్రంగానే రాజ‌కీయాలు చేయ‌నున్నారు. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ పై ఉన్న అనుమానాలు కూడా మ‌రో రెండు రోజుల్లో పూర్తిగా తొల‌గిపోనున్నాయి.

దీంతో జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే.. రాజ‌ధాని అమ‌రావ‌తి నుండి త‌ర‌లిస్తార‌ని జోరుగా ప్ర‌చారం చేస్తున్న టీడీపీ త‌మ్ముళ్ళ‌కు జ‌గ‌న్ ఈ దెబ్బ‌తో చెక్ ప‌ట్టేసిన‌ట్టేన‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.