జగన్ కు వడదెబ్బ.. మూడు రోజులు రెస్ట్?

Wednesday, May 30th, 2018, 10:13:42 AM IST

ప్రస్తుతం ఎండ తీవ్రత తగ్గు ముఖం పడుతున్నా కూడా మన నాయకుల్లో వేడి మాత్రం తగ్గడం లేదు. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా కూడా మన రాష్ట్రంలో ముందే సమరం మొదలైంది. ప్రజలను ఆకర్షించేందుకు నాయకులు ఎవరి స్టైల్ లో వారు యాత్రలతో సభలతో ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు ఎక్కువగా సభలతో తెలుగు ప్రజలను ఆకట్టుకుంటుంటే పవన్ జనం మధ్యలోకి వెళ్లి సభలను నిర్వహిస్తున్నారు. ఇక వీరిద్దరికంటే ఎక్కువ స్థాయిలో జగన కష్టపడుతున్నాడనే చెప్పాలి.

సమ్మర్ వేడిని సైతం లెక్క చేయకుండా వైసిపి అధినేత తన పాదయాత్రను కొనసాగించాడు. దాదాపు ఆరు నెలల నుంచి తీరిక లేకుండా గ్రామా ప్రజల నుంచి మద్దతు పొందడానికి కృషి చేస్తున్నాడు. మార్గం మధ్యలోనే బస చేస్తూ వెళ్లసాగాడు. అయితే చాలా కాలం తరువాత జగన్ కొంచెం అస్వస్థతకు గురయ్యాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో జగన్ అలుపు లేకుండా పాదయాత్ర చేసినందుకు వడదెబ్బ తగిలిందని వైఎస్సార్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ వెల్లడించారు. అలాగే జలుబు తలనొప్పి జ్వరం ఉన్నప్పటికీ జగన్ గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేశారని తెలుపుతూ.. నిన్న కొంచెం నీరసంగా అనిపించడంతో వైద్యులు వచ్చి జగన్ ను చెక్ చేశారని తెలిపారు. పూర్తిగా కోలుకున్న తరువాత పాదయాత్ర కొనసాగిస్తే బావుంటుందని మూడు రోజుల వరకు రెస్ట్ తప్పనిసరి అని వైద్యులు చెప్పినట్లు వైసిపి నేతలు తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments