జ‌గ‌న్‌ది ఓవ‌ర్ కాన్ఫిడెంట్ కాదు.. అంత ధీమా వెనుక ఉన్న సంచ‌ల‌న విష‌యం ఇదే..!

Tuesday, April 23rd, 2019, 09:40:11 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక‌ ఎన్నికల ఫ‌లితాల టెన్ష‌న్ రాజ‌కీయ‌నేత‌ల్లో విప‌రీతంగా పెరిగిపోతుంది. ఇక ఎన్నిక‌ల పోలింగ్ త‌ర్వాత టీడీపీ అధినేత అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ మ‌రోసారి భారీ స్థాయి విజయం సాధించడం ఖాయమని ప్ర‌భుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామ‌ని ముఖ్య‌మంత్రిగా మ‌రోసారి తానే ప్ర‌మాణ స్వీకారం చేస్తాన‌ని పైకైతే చెబుతూ ఉన్నారు. అయితే మరోవైపు చంద్ర‌బాబు ఈవీఎంల మీద అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉండ‌డం చూస్తుంటే చంద్ర‌బాబుకు గెలుపు పై అస‌లు న‌మ్మ‌క‌మేలేద‌ని తెలుస్తోంది.

ఇక మ‌రోవైపు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం ఎన్నిక‌ల ముందునుండి అలాగే పోలింగ్ అయిపోయిన త‌ర్వాత కూడా గెలుపు పై ఎంతో ధీమా వ్య‌క్తం చేస్తున్ఏనారు. వైసీపీ విక్టరీ ఫిక్స్ అయిపోయింద‌ని జ‌గన్ అన్నారు. ఈ క్ర‌మంలో జగన్ ధీమా ఏంటంటే.. ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నిక‌ల పోలింగ్ త‌ర్వాత జగన్ చాలా విస్తృతమైన సర్వేలు చేయించుకున్నారని, మొత్తం ఆరు విభిన్న సంస్థల ద్వారా జగన్ సర్వేలు చేయించుకున్నారని.. అవన్నీ జగన్‌కు పాజిటివ్ సంకేతాలు ఇచ్చాయని, అలాగు ప్రీ పోల్ – ఎగ్జిట్ పోల్ సర్వేలను జగన్ తీసుకున్నారని.. అన్నీ కూడా వైసీపీకి వంద సీట్లకు తగ్గే అవకాశం లేదని ఆ స‌ర్వేల‌న్నీ తేల్చిచెప్ప‌డంతో జగన్ విజయం పట్ల ధీమాతో ఉన్నారని, అంతే కానీ జ‌గ‌న్‌ది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కాద‌ని వైసీపీ శ్రేణులు అంటున్నారు.