జ‌గ‌న్ లండ‌న్ నుండి రాగానే.. అసలు క‌థ‌ స్టార్ట్ అవుతోందా..?

Wednesday, February 20th, 2019, 07:39:38 PM IST

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లండన్ వెళ్ళిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఊహించ‌ని వ్యూహాల‌తో రాజ‌కీయవ‌ర్గాల్లో హీట్ పెంచుతూ అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు.

అయితే తాజాగా ఏపీలో హైటెన్ష‌న్ పొలిక‌ర్ డ్రామాకి బ్రేక్ ప‌డింది. త‌న కూతురును చూడ‌డానికి లండన్ వెళ్ళారు జ‌గ‌న్. ఆయ‌న కూతురు లండ‌న్‌లో ప్ర‌ముఖ విద్యా సంస్థ‌లో చ‌దువుతున్న సంగ‌తి తెలిసిందే.

జ‌గ‌న్ పాద‌యాత్రం కంప్లీట్ అయిన‌ప్పుడే వెళ్ళాల్సింది. కానీ అప్పుడు బిజీ ప్రోగ్రామ్స్ వ‌ల్ల అప్ప‌టి క‌ప్పుడు లండ‌న్ టూర్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు జ‌గ‌న్.

ఇక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో, ఎన్నిక‌లు పూర్తి అయ్యే వ‌ర‌కు గ్యాప్ దొర‌క‌డం క‌ష్టం క‌నుక‌, ఒక వారం రోజులు ప్రోగ్రాం స‌ర్దుబాటు చేసుకుని లండ‌న్ వెళ్ళారు జ‌గ‌న్.

అయితే ఇప్పుడు అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. రాష్ట్రంలో ప్ర‌స్తుతం జ‌గ‌న్ లేక‌పోవ‌డంతో రాజ‌కీయ‌ప‌రిణామాల్లో కొంచెం వేగం త‌గ్గంది. కానీ జ‌గన్ తిరిగా రాగానే రాజ‌కీయ‌వాతార‌ణం పూర్తి ర‌స‌వ‌త్త‌రంగా మారనుంద‌ని స‌మాచారం.

ఇప్పటికే ప‌ల‌వురు టీడీపీ నేత‌లు వైసీపీలో చేరిన విష‌యం తెలిసిందే. అయితే జ‌గ‌న్ లండ‌న్ నుండి రాగానే, చాలా మంది నేత‌లు వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నార‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుతో చివ‌రిగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌వారు, ఇప్ప‌టికే రాజీనామాకు సిద్ధ‌మైన వారు, ఇంకా సంధిగ్దంలో ఉన్న వారు, వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నార‌ని స‌మాచ‌రం. దీంతో జ‌గ‌న్ ఎంట్రీ త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కె అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ‌వర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.