జగన్ తో రామోజీరావు.. ఆ ముప్పావు గంట ఏం చేశారు..?

Monday, October 23rd, 2017, 10:17:10 PM IST

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో తాజగా జరిగిన జగన్ భేటీ ఆసక్తిని రేపుతోంది. ఈ భేటీ రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. తాజగా సిబిఐ కోర్టు జగన్ కు ఆంక్షలు విధించడం, త్వరలో పాదయాత్ర చేయడానికి జగన్ సమాయత్తం అవుతున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దాదాపు 45 నిమిషాల పాటు వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది.

జగన్ వెంట కేవలం భూమన కరుణాకర్ రెడ్డి మాత్రమే వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ రామోజీరావు వద్దకు రహస్యంగా వెళ్లినా బయటకు వార్తలు వచ్చేసాయి. పాదయాత్ర చేయనున్న నేపథ్యంలో ఆయన ఆశీస్సులు కోరడానికి వెళ్ళారనే ప్రచారం కూడా జరిగుతోంది. టీడీపీ నేతలు మాత్రం వీరి కలయికని పలు విధాలుగా విశ్లేషిస్తున్నారు.