వైజాగ్ లో మిస్సైనా..జగన్ ఇంట్లో మాత్రం మిస్సవలేదు..!

Friday, January 27th, 2017, 12:03:11 AM IST

jagan-family-candle-raley
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రత్యేక హోదా కోసం వైజాగ్ లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనడానికి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే జగన్ ని పోలీస్ లు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లోనే నిర్బంధించారు. దీనితో జగన్ క్యాండిల్ ర్యాలీ లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. వైజాగ్ లో క్యాండిల్ ర్యాలీ ఆగిపోయినా జగన్ ఇంట్లో మాత్రం ఆగలేదు. జగన్ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటానికి ఆయన కుటుంభం సభ్యులు సంఘీభావం తెలిపారు.

హైదరాబాద్ లోని ఆయన నివాసం లోటస్ పాండ్ లో ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి మరియు ఇతర కుటుంబ సభ్యులు క్యాండిల్ ప్రదర్శన చేసారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఇచ్చిన పిలుపు కు సంఘీభావం తెలుపుతూ క్యాండిల్ ప్రదర్శన చేసారు. కేంద్రప్రభుత్వం ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు కోరారు. తద్వారా జగన్ ఆకాంక్ష ఫలించాలని అన్నారు.కాగా గురువారం సాయంత్రం వైజాగ్ లో క్యాండిల్ ర్యాలీ లోపాల్గొనడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వైజాగ్ కు జగన్ వెళ్లారు. పోలీస్ లు జగన్ ని వైజాగ్ ఎయిర్ పోర్ట్ లోనే నిర్బంధించారు. అక్కడ పోలీస్ లకు జగన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాను రెండేళ్లలో ముఖ్యమంత్రిని అవుతానని మీ అందరిని గుర్తుంచుకుంటానని జగన్ పోలీస్ లతో తెలపడం విశేషం.