జగన్ ప్రకటన అదిరిపోయిందిపో.. మీ అన్న సీఎం అవుతాడు అంటూ..!!

Wednesday, October 18th, 2017, 04:00:53 AM IST

ఏపీ పక్షనేత జగన్ 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా జగన్ నేడు అనంతపురంలో పర్యటించారు. ముడి పట్టు రాయితీకోసం దీక్ష చేస్తున్న చేనేత కార్మికులని పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన ప్రకటన ఏపీ లో పొలిటికల్ హీట్ ని పెంచే విధంగా ఉంది. ‘బడుగు బలహీన వర్గాలకు పింఛన్ రావాలంటే 50 ఏళ్లు నిండాలని నిబంధన ఉంది. మీ అన్న( జగన్) ముఖ్యమంత్రి అవుతాడు. దానిని 45 ఏళ్లకు తగ్గిస్తాడు. మనతంతా ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. నేను అధికారంలోని వచ్చాక అర్హత ఉన్న 45 ఏళ్ళు నిండిన వారందరికీ నెలకు వెయ్యి కాకుండా రెండు వేలు పింఛను మంజూరు చేస్తా’ అంటూ జగన్ జనాకర్షక పథకాన్ని ప్రకటించారు.

రోజు పని దొరికితేనే పేదల కడుపు నిండుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు పని దొరకడం కష్టంగా మారింది. అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని కూడా జగన్ హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు రుణాలు ఇచ్చేందుకు చేనేత కార్పొరేషన్ ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. జగన్ ప్రకటిస్తున్న ఎన్నికల హామీలు తమని అధికారంలోకి తీసుకుని వస్తాయని వైసిపి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments